పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/152

ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు బోధను విని విశ్వసించడం ఎంతో ధన్యమైన కార్యం - లూకా 11, 27-28, ఈలా ప్రభువు తన బోధలద్వారా అద్భుతాలద్వారా అనేక స్త్రీల భక్తిని పెంచాడు. వారికి పశ్చాత్తాపం, విశ్వాసం, వాక్యశ్రవణం మొదలైన సుగుణాలను నేర్పాడు.

5. క్రీస్తు తానెవరో స్త్రీలకు తెలియజేయడం

క్రీస్తు తన్ను గూర్చి తాను స్త్రీలకే అధికంగా తెలియజేసికొన్నాడు. అతడు సొంత శిష్యులకు గూడ తన్ను గూర్చి తాను అంత వివరంగా తెలియజేసికోలేదేమో!

అతడు సమరయ స్త్రీకి తన్నుదేవుని వరంగా తెలియజేసికొన్నాడు. తన్ను దావీదుని కుమారునిగా, అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్గానంగా ఎరుకపరచుకొన్నాడు. ఇంకా తన వాక్కు దేవుణ్ణి తెలియజేసే సందేశమని గూడ చెప్పాడు. పవిత్రాత్మే జీవజలమనీ ఆ జలం తననుండి బయలుదేరి భక్తుల హృదయాల్లోకి పారుతుందనీ చెప్పాడు. ఈ సత్యాలన్నిటినీ ఆ దశలో సమరయ మహిళ గ్రహించలేదు. ప్రభువు అనుగ్రహంవల్ల నేడు మనం ఈ వేదసత్యాలను కొంతవరకైనా గ్రహించగలుతున్నాం - యోహా 4, 7-14.

ప్రభువు సమరయ స్త్రీతో నిజమైన ఆరాధకులు ఆత్మయందూ సత్యమందూ తండ్రిని ఆరాధిస్తారని చెప్పాడు - యోహా 4,23. ఇక్కడ సత్యమంటే క్రీస్తే మనం పవిత్రాత్మ శక్తితో ఉత్తాన క్రీస్తుద్వారా తండ్రిని ఆరాధిస్తాం. యూదులు యెరూషలేములోను, సమరయులు గిరిజం కొండమీదను దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ యారాధనకు ఇక విలువలేదు. నిజమైన ఆరాధన ఆత్మద్వారా క్రీస్తుద్వారా క్రైస్తవులు తండ్రికి చేసే ఆరాధన. ప్రభువు ఈలాంటి నిగూఢమైన వేద సత్యాలను సమరయ స్త్రీకి తెలియజేసాడు. కడన తానే మెస్పియానని కూడ ఆమెకు విశదం చేసాడు - 4, 26.

క్రీస్తు మార్తతో నేనే పునరుత్తానాన్ని జీవాన్ని నన్ను విశ్వసించేవాడు మరణించినా జీవిస్తాడు. జీవముండగా నన్ను విశ్వసించేవాడు ఏనాటికీ మరణాన్ని చవిచూడడు అన్నాడు - యోహా 11, 25-26. ఇక్కడ క్రీస్తు తానే మన పునరుత్తానాన్నని తెలియజేసికొన్నాడు. అతని జీవంలో పాలుపొందితే మనకు నిత్యజీవం కలుగుతుంది. కనుక మనకు జీవమూ పునరుత్తానమూ మోక్షజీవమూ కూడ అతడే

ఉత్తాన క్రీస్తు మొదట దర్శనమిచ్చింది అపోస్తలులకు గాదు, పుణ్యస్త్రీలకు. వీళ్ళ తర్వాతనే అతడు అపోస్తలులకూ పేత్రుకి కన్పించాడు. ప్రభువు మరియ మగ్డలీనకు దర్శనమిచ్చి ఆమెను ఓదార్చాడు. ఆమె మొదట అతన్ని గుర్తుపట్టలేదు. తోటమాలి అనుకొంది. కాని ప్రభువు మరియా అని పేరెత్తి పిలవగానే ఆమె అతన్ని గుర్తుపట్టింది. తర్వాత ప్రభువు ఆమెను అపోస్తలుల వద్దకు పంపి తాను వుత్తానమైనట్లు వారికి