పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/143

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ సందర్భంలో పరిసయులు, మోషే భార్యాపరిత్యాగాన్ని అంగీకరించాడు కదా అని ఎదురు ప్రశ్న వేసారు. దానికి జవాబుగా ప్రభువు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే విడాకులను అంగీకరించాడుగాని సృష్ణ్యాదిలో ఈ పద్దతిలేదు అని చెప్పాడు. యూదులు స్త్రీలను న్యూనంగా చూచి క్రూరంగా హింసించేవాళ్ళు పురుషులనుండి ఈ బాధలను భరించడంకంటె స్త్రీకి విడాకులే మేలు అన్న తలంపుతో మోషే భార్యాపరిత్యాగాన్ని అంగీకరించాడు. అంతే కాని ఇది దేవుని చిత్తంకాదు. యూద పురుషుల దుష్టత్వం వలన పుట్టిన దురాచారం.

పైగా మోషే విడాకులను అంగీకరించాడేగాని పునర్వివాహాన్నిఅంగీకరించలేదు. కనుక విడాకులు పొందిన వాళ్ళు మల్లా అన్యులను పెండ్లాడితే అది వ్యభిచారం క్రిందే లెక్క అన్నాడు క్రీస్తు - మత్త 19, 7–9.

క్రీస్తునాడు యూద సమాజంలో స్త్రీలకు ఆదరణ లేదని చెప్పాం. ఐనా క్రీస్తు కొందరు పుణ్యస్త్రీలను శిష్యురాళ్ళనుగా చేర్చుకొన్నాడు. వీళ్ళ ప్రేషిత ప్రయాణాల్లో క్రీస్తు వెంట వెళ్లేవాళ్ళ తమ సొంత డబ్బునే వెచ్చించి క్రీస్తు మరియు శిష్యుల భోజనావసరాలను తీర్చేవాళ్ళ వీళ్ళల్లో హెరోదు గృహనిర్వాహకుడైన ఖూజా అనేవాని భార్యయైన యోహాన్న కూడ వుంది. ఈమె సంపన్నవర్గం మహిళ - లూకా 8, 1-8. క్రీస్తు ఈ పుణ్యస్త్రీలను ఆదరంతో జూచాడు, స్త్రీ విద్య బొత్తిగాలేని ఆ రోజుల్లో వారికి బైబులు బోధలు నేర్పించాడు. యూదులు స్త్రీని సంతానాన్ని ఉత్పత్తి చేసేదాన్ని గాను, కాయకష్టంచేసి డబ్బు గడించే దాన్ని గాను మాత్రమే పరిగణించారు. కాని క్రీస్తు ఆమెను దేవుని రూపంగల మనుష్య వ్యక్తినిగా గుర్తించాడు. అతని దృష్టిలో పురుషుడెంతో స్త్రీ అంత వారిద్దరి విలువ సరిసమానమే.

3. స్త్రీలపట్ల క్రీస్తు ధ్రుక్పధాలు

1. స్త్రీల గృహకృత్యాల్లో ఆసక్తి చూపడం

ప్రభువు దైవరాజ్య వ్యాప్తికి స్త్రీలు పులియబెట్టిన పిండిని వుపమానంగా తీసికొన్నాడు. కొంచెం పులిసిన పిండి మూడు కుంచాల మామూలు పిండిని పలియబెట్టింది. పులిసిన పిండి పెరుగుతుంది. ఈ పిండితోనే రొట్టెలు చేస్తారు. ఈలాగే దైవరాజ్యం క్రీస్తునాడు చిన్నదిగావున్నా తర్వాత విస్తారంగా వ్యాపిస్తుందని భావం - మత్త 13, 33,

ప్రభువు ప్రాతనిబంధనానికి క్రొత్త నిబంధనానికీ చాల తేడావుందని చెప్తూ స్త్రీలు బట్టలకు మాసికవేసే విధానాన్ని ఉపమానంగా తీసికొన్నాడు. ఆడవాళ్ళు ప్రాతగుడ్డను

137