పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/140

ఈ పుట ఆమోదించబడ్డది

{{center

9.క్రీస్తూ-స్త్రీలూ

}} {{right

బైబులు భాష్యం - 99

}} {{center

విషయసూచిక

}}

1.యూద సమాజంలో స్త్రీల స్థానం
2.క్రీస్తు స్త్రీలకిచ్చిన విలువ
3.స్త్రీలపట్ల క్రీస్తు దృక్పథాలు
4.క్రీస్తు శిష్యురాళ్లకు బోధచేయడం
5.క్రీస్తు తానెవరో స్త్రీలకు తెలియజేయడం
6.మహిళాభ్యుదయం

1. యూద సమాజంలో స్త్రీల స్థానం

క్రీస్తు స్త్రీలతో మెలగిన తీరును అర్థంచేసుకోవాలంటే మొదట ఆనాటి యూద సమాజంలో స్త్రీలకున్న స్థానాన్ని సరిగా గ్రహించాలి. యూద మహిళలు మైనరు వ్యక్తుల క్రిందే లెక్క కనుక న్యాయసభలో వాళ్ళ సాక్ష్యం చెల్లదు. వాళ్లు కోర్టుకు వెళ్ళి న్యాయాన్ని పొందలేరు. స్త్రీలకు చదువు ఎంతమాత్రం వుండేదికాదు. వాళ్ళ బైబులు చదవలేరు. రబ్బయుల దగ్గర ధర్మశాస్త్రం చదువుకొనేది మగపిల్లలు మాత్రమే. స్త్రీలకు ఆస్తిహక్కులేదు. తండ్రికి మగసంతానం లేనప్పడు మాత్రమే అతని ఆస్తి కూతురుకి సంక్రమించేది.

ఇంటిపని విశేషంగా మహిళలది. వాళ్లు భోజనం సిద్ధంజేయాలి, నీళ్ళు తీసికొనిరావాలి, బట్టలు తయారుచేయాలి. కనుక పిండి విసిరి రొట్టెలు కాల్చడం, వంటచెరకు నీళ్ళ తీసికొని రావడం, ಐಲ್ಡಲು నేయడం కుట్టడం మొదలైన నానా కార్యాలతో ఆడవాళ్ళ దినమంతా సతమతమైపోయే వాళ్లు, వీటితోపాటు మందలుకాయడం, పొలంలో పైరువేసి కోతకోయడం మొదలైన వ్యవసాయపు పనుల్లోగూడ స్త్రీలు పాల్గొనేవాళ్లు.

యూదులది పితృస్వామ్య వ్యవస్థ యువతులకు 12 - 13 ఏండ్ల ప్రాయంలో పెండ్లిజేసేవాళ్ళ పెండ్లి సొంత తెగలోనే కుదిర్చేవాళ్లు, వరుడు వధువు తండ్రికి కన్యాశుల్కం చెల్లించాలి. ఆమె బంధువులకు కానుకలీయాలి. వివాహంతో వధువు వరుని ఆస్తిఔతుంది, అతడు ఆమెకు యజమానుడు, అధిపతి (బాలు) ఔతాడు - నిర్గ 20,17. మగబిడ్డను కనిన స్త్రీకి మన్నన వుంటుంది. ఆడబిడ్డలను కనినా, అసలు బిడ్డలనే కనకపోయినా