పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/130

ఈ పుట ఆమోదించబడ్డది

3. దళితులకొరకు శ్రమించిన క్రీస్తు

7. బహిష్కృతులకు స్నేహితుడు

ప్రభువు దళితులతో కలసి, దళితుల కొరకు పోరాడి వారికి విమోచనం సంపాదించి పెట్టాడు. క్రీస్తు దళితుడుగా తన స్వేచ్చను అణచుకోలేదు. అతడు నిప్రియాపరుడు, నిరాశావాది, పోరాటంనుండి తప్పించుకొనేవాడు కాదు. అవరుల బాధలకు అతని హృదయం స్పందించింది. అతనిలోని శక్తి ఉత్సాహమూ కట్టలు బ్రెంచుకొని వెల్లువలై పారాయి. బడుగువర్గాలవారిని విమోచించడానికి అతడు అధికారం పొందాడు. నిప్పలో పెట్టిన కత్తి పదునెక్కినట్లే అతడూ చైతన్యం పొందాడు. అథోజగత్ సహోదరులను పైకి లేపి దైవరాజ్యంలోకి చేర్చడానికి పూనుకొన్నాడు.

అతడు పాపలతో కలసి జ్ఞానస్నానం పొందాడు. దాని ద్వారా పాపులకు స్వేచ్చా సిద్ధించాయి. నీటిలో జ్ఞానస్నానం పొందిన క్రీస్తు తర్వాత తన రక్తంతోనే జ్ఞానస్నానం పొంది పాపుల పాపాలకు పరిహారం చేసాడు.

ప్రభువు ఎప్పడూ ఆనాటి దళితులైన పేదవర్గాలవారితో కలసిపోతుండేవాడు. గలిలయ సీమ ఆనాటి మాలపల్లె, మాదిగపల్లె, యేసు చాల యేండ్ల అక్కడే జీవించి అక్కడి ప్రజలతో కలసిపోయాడు. అతని శిష్యులూ, అపోస్తలులూ అక్కడివాళ్లే వాళ్లు చేపలు పట్టడం, వడ్రంగం, సుంకాలు వసూలుచేయడం, చర్మాలు శుద్ధి చేయడం మొదలైన నీచవృత్తులు చేపట్టి జీవించేవాళ్లు, వారికి విద్యాగంధం వుండేది కాదు. ఈలాంటి వాళ్లు ఆ గురువు శిష్యులు, అతడు విద్యావంతులకు గాక పల్లెల్లోని పామరజన సమూహాలకు బోధించాడు. రోగులను, వికలాంగులను, కుష్టరోగులను, భూతావేశులను స్వస్థపరచాడు. వాళ్లు ఆనాటి సమాజంలో అంటరానివాళ్లు, ఆలాంటి సంఘ బహిష్కృతులకు అతడు స్నేహితుడు, ఆపడు. - మత్త 11,19.

8. దళితులను ఎన్నుకొన్నాడు

ప్రభువు నేను రోగులకొరకు వచ్చిన వైద్యుణ్ణి అన్నాడు - మార్కు 2, 17. ఈ పాపపు రోగులు యూద సమాజంలోని అట్టడుగు వర్గం ప్రజలు. వీళ్లే నేటి అస్పృశ్యులు. ఈ ప్రజలు కాపరిలేని మందలా వుండడంజూచి అతడు వాళ్లమీద జాలిగొన్నాడు - మత్త 9, 36. సురక్షితంగా వున్న 99 గొర్రెలను వదలివేసి తప్పిపోయిన ఒక్క గొర్రెను వెదకబోయాడు - లూకా 15,4 రోగులను, ఆకలిగొన్నవారిని, బంధువియోగంతో బాధపడేవారిని ప్రత్యేకంగా పరామర్శించాడు.