పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/121

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువును గాఢంగా ప్రేమించాడు అనుకోవాలి. ప్రేమ శిష్యుని ప్రధాన లక్షణం. మూడవ పర్యాయం పేత్రు తనకు సహజమైన తొందరపాటును అణచుకొని ఇంకా వినయంగా జవాబు చెప్పాడు.

ప్రభువు పేత్రుతో నా గొర్రెలను మేపు అని ముమ్మారు చెప్పాడు. అనగా క్రీస్తు అనుచరులకు అతడు కాపరి అయ్యాడు అని భావం. బైబుల్లో కాపరి అంటే నాయకుడు, అధికారి. కనుక పేత్రు క్రీస్తు అనుయాయులకు సర్వాధికారి అయ్యాడని అర్థం. గొర్రెలేమో క్రీస్తువే. అతడే ప్రధాన కాపరి. ఐతే ఆ కాపరి తన స్థానంలో పేత్రుని ముఖ్యకాపరినిగా నియమించాడు. తండ్రి తన్ను పంపినట్లే క్రీస్తు శిష్యులను పంపాడు. అతడు ప్రధాన కాపరి ఐనట్లే తన తరపున ఉపకాపరిని గూడ నియమించాడు.

ఆ కాలంలో ప్రాచ్యదేశాల రాజులు తాము ఇతరులకు ఆయాహక్కులను జారీచేసినపుడు ప్రజలందరు వినేటట్లుగా చెప్పిన మాటలే మూడుసార్లు చెప్పేవాళ్లు, రాజు దయచేసిన హక్కుకి ఇక తిరుగులేదని దీని భావం. దీన్ని బట్టి క్రీస్తు పేత్రుకి దయచేసిన హక్కుకి కూడ తిరుగులేదని అర్థంచేసికోవాలి.

ఐతే పేత్రు తన అధికారంతో ఏమిచేస్తాడు? ప్రజలకు వేదబోధచేస్తాడు. సంస్కారాలు జరుపుతాడు. మంద మేలు కొరకు కృషిచేస్తాడు. అవసరమొచ్చినపుడు ఆ మంద కొరకు ప్రాణాలు కూడ అర్పిస్తాడు.

ప్రభువు పేత్రుని అడిగినట్లే నేడు మనలను కూడ నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. పేత్రులాగమనం కూడ పాపంలో పడిపోయినవాళ్లం. కాని అతనిలాగ మనంకూడ ప్రభువుని ప్రేమించి వుండాలి. అప్పడేగాని పేత్రులాగమనంకూడ "ప్రభూ! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవెరుగుదువు" అని చెప్పలేం. అనగా పేత్రుకీ మనకూ సామ్యం పాపం చేయడంలో మాత్రమే వుండకూడదు. ప్రభుని ప్రేమించడంలో గూడ వండాలి. మనలను దేవునికి ప్రీతిపాత్రులను చేసేది ప్రధానంగా ప్రేమే. ఐతే దేవునిపట్ల నాకున్న ప్రేమ ఏపాటిది?

ఇంకా, ప్రభువు పేత్రులాంటిపాపికి తిరుసభమీద సర్వాధికారం ఒప్పగించాడు. నేడు తిరుసభలోని అధికారుల బలహీనతలను చూచి మనం విస్తుపోగూడదు. అధికారుల లోపాలు దేవునికి తెలియనివికావు. అవసరమొచ్చినప్పడు ప్రభువే వాటిని చక్కదిద్దుతాడు.

పేత్రు క్రీస్తు గొర్రెలను ఎలామేపాలి? అవి తనవి అన్నట్లుగా గాక, క్రీస్తవి అన్నట్లుగా భావించి మేపాలి. అనగా క్రీస్తు మనోభావాలతో మందను మేపాలి. ఈలాగే