పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

- 13, ఇదే వాక్యం దివ్యసత్రసాద ప్రసంగంలో కూడ కన్పిస్తుంది -6,11.ఆ ప్రసంగం కూడ గలిలయసరస్సు తీరాన చేసిందే - 6,25. కనుకనే ఈ భోజనం దివ్య భోజనానికి సూచనంగా వుంటుందని చెప్పాం. ఇంకా యీ కథలో క్రీస్తు బొగ్గులతో మంటవేసి చేపలనూ రొట్టెనూ కాల్చి శిష్యులకు ఆహారంగా యిచ్చాడు. అనగా అతడు ఇక్కడ సేవకుడుగా వ్యవహరించాడని భావం. "సేవకుడు" అనేది క్రీస్తు బిరుదుల్లో వొకటి.

ఎమ్మావు శిష్యుల కథలో కూడ భోజన విషయం వస్తుంది-లూకా 2-4, 3031. శిష్యులు దివ్యసత్రసాద భోజనంలో క్రీస్తుని గాఢంగా అనుభవానికి తెచ్చుకొంటారు అని యీ ఘట్టాల భావం. నేడు మనమూ ప్రభువుని ఈలాగే అనుభవానికి తెచ్చుకోవాలి. ఇంకా, 20వ అధ్యాయంలో ప్రభువు శిష్యులకు ఆత్మను దయచేసాడు. 21వ అధ్యాయంలో దివ్యభోజనాన్ని దయచేసాడు. ఇవి రెండూ గొప్ప భాగ్యాలు. నేడు మనంకూడ ప్రభువు నుండి ఈ భాగ్యాలను సమృద్ధిగా పొందాలి.

శిష్యులు రాత్రంతా ప్రయాసపడినా చేపలు దొరకలేదు. ఉదయాన్నే క్రీస్తు ఆజ్ఞతో వాళ్లు విస్తారంగా చేవలను పట్టారు. శిష్యులు క్రీస్తు సహాయంలేకుండా చేపలను పట్టినట్లుగా సువిశేషాల్లో ఎక్కడ చదవం. మన ప్రేషిత సేవలో ప్రభువు సహాయం ఎంత అవసరమో దీన్నిబట్టే అర్థంచేసికోవాలి. ఇంకా 'రాత్రి” “పగలు" అనే మాటలకు కూడ యోహాను సువిశేషంలో సాంకేతికార్ధాలున్నాయి.

శిష్యుల్లాగ నేడు మనంకూడ చేపలను పట్టడానికి, అనగా వేదబోధచేయడానికి పోవాలి. క్రీస్తు అనుగ్రహంతో చాలమందిని తిరుసభలోనికి తీసుకరావాలి. ఇంకా వుత్తాన క్రీస్తుచుటూ చేరి దివ్యభోజనాన్ని ఆరగించాలి. ఆ ప్రభువు పేరుమీదిగా ఓ భక్తసమాజంగా ఐక్యంగావాలి. తిరుసభలో ఉత్థానక్రీస్తు సాన్నిధ్యం బలంగా పనిచేస్తుంటుంది. ఆ సాన్నిధ్యాన్ని మనం భక్తిభావంతో గుర్తించాలి.

6. పేత్రుకి అధికారం 21, 15-17

ప్రభువు పేత్రు పాపాన్ని పరిహరించి అతనికి అధికారాన్ని ఒప్పజెప్పడం ఇక్కడ ముఖ్యాంశం. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని క్రీస్తు పేత్రుని మూడుసార్లు అడిగాడు. మూడుసార్లు పేత్రు ప్రేమిస్తున్నానని జవాబు చెప్పాడు, పూర్వం అతడు ప్రభువును ఎరగనని మూడుసార్లు బొంకాడు కదా! దానికి పరిహారంగా ఇప్పుడు మూడుసార్లు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు, ఇక్కడ క్రీస్తు అడిగిన మూడు ప్రశ్నలను బట్టి అతడు పేత్రు ప్రేమను శంకించాడు అనుకోగూడదు. పేత్రు చెప్పిన మూడు జవాబులను బట్టి అతడు