పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

నియమిస్తాను. అతడు జ్ఞానంతో వివేకంతో మిమ్మ పరిపాలిస్తాడు” అంటాడు - 3,15, ఈ కాపరి గొర్రెల మందకు ఏకైక పాలకుడు, అతని మీద ప్రభువొక్కడే అధికారి, కావున ప్రభువు యెహెజ్కేలు ముఖాన “నా సేవకుడైన దావీదును నా గొర్రెల మీద కాపరినిగా నియమిస్తాను. అతడు వానిని మేపుతాడు. యావేనైన నేను వాటికి దేవుడను. నా సేవకుడైన దావీదు వాటికి పాలకుడు” అని చెప్పాడు - 34, 23, ఈలా తన సేవకుడైన దావీదు ద్వారా ప్రభువే మందను మేపుతాడు - 34, 15. ఈ క్రొత్త దావీదే ప్రభువు పంపనున్న మెస్సీయా, ఇప్పటి నుండి యూదుల భావాలు రానున్న మెస్సీయా మీద కేంద్రీకరింపబడ్డాయి. 6. బాబిలోను ప్రవాసం ముగిసాకగూడ పాలస్తీనాలోని యిప్రాయేలు ప్రజలు నాయకులు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చారు. అందుచే ప్రవక్తలు వాళ్లను చీవాట్లపెట్టారు. ప్రభువు నాయకులనబడే కాపరులను శిక్షిస్తాడు అంటాడు ప్రవక్త జెకర్యా - 10,3. కాని ఈ కాపరుల్లో ఒక్కడు మాత్రం చాల యోగ్యుడు. శత్రువులు అతని రొమ్మును పొడిచి తెరుస్తారు. ఏకైక కుమారుడ్డి కోల్పోయినవాళ్లలాగ, తొలిచూలుబిడ్డను పోగొట్టుకున్న వాళ్లలాగ జనులు అతనికోసం విలపిస్తారు – 12,10. ఈ కాపరి వక్షస్సు ప్రయ్యెలౌతుంది. అతడు దెబ్బలుతిని తన మందను కాపాడతాడు. యెషయా నుడివిన బాధామయ సేవకుని మీదలాగే ఈ కాపరిమీదా ప్రభువు మన అందరి దోషాలను మోపుతాడు - యెష 53,6. ప్రవక్తలు నుడివిన ఈ మహానుభావుమని కోసం యూదులంతా యెదురుచూడ్డం మొదలెట్టారు. ఆ కాపరిని, ఆ క్రొత్త దావీదును, ఆ మెస్సీయాను కన్నులారా చూడాలని ఉబలాటపడ్డారు. వాళ్ల కోరికల ఫలితమో అన్నట్లు పూర్వవేద రచయితలు సూచించిన కాపరి విజయంచేసాడు. 7. మీకా ప్రవచనాన్ననుసరించి క్రీస్తు బేల్లెహేము నగరంలో జన్మించాడు. అతడు యిస్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడు లేక కాపరి - మత్త2,6. కాపరుల బిడ్డడైన క్రీస్తును దర్శించడానికై కాపరులు పరుగుపరుగున వచ్చారు. తొట్టిలో పరుండియున్న శిశువును చూచారు — లూకా 2, 16. శిష్యులు, పాపాత్ములు, సుంకరులతోపాటు ఈ కాపరులుగూడా ప్రభువు చిన్నమందకు చెందినవాళ్ళు. కనుక వాళ్ళు దేవుని రాజ్యాన్ని పొందుతారు - లూకా 12, 32. 8. ఈ ప్రభువు యిప్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెలకొరకు మాత్రమే వచ్చాడు - మత్త 15,24. క్రీస్తు తర్వాత క్రీస్తుశిష్యులు అతని సువార్తను అన్ని జాతులకు అందిస్తారు. ఈ కాపరి కరుణామయుడు, కనుకనే అతడు తప్పిపోయిన గొర్రెను వెదక్కుంటూ పోతాడు - లూకా 15, 4-7 దిక్మూమొక్కూ లేక అలమటిస్తూ కాపరిలేని గొర్రెల్లాచెదరివున్నప్రజలను చూడగానే ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయింది