పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/105

ఈ పుట ఆమోదించబడ్డది

2,21-24. మనం క్రీస్తుపట్ల విశ్వాసాన్ని కోల్పోయి ఆ ప్రభువుని మళ్ళా సిలువ వేయకూడదు - హెబ్రే 6,6. నేడు మనం క్రీస్తు సిలువలో తప్పితే మరి దేనిలోను గర్వించకూడదు - గల 6,14. మనకు కీర్తిని చేకూర్చేది సిలువ వొక్కటే.

4 సిలువ భక్తి

క్రీస్తు రాకపూర్వమే లోకం సిలువ ఆకృతిని వాడేది. ప్రాచీన లోకంలో గీతమీద గీతగీస్తే నాలు దిక్కులు అని అర్థం. స్వస్తిక సూర్యుని వెల్లురునీ, జననశక్తినీ సూచించేది. శిక్షాసాధనంగా సిలువ చాలదేశాల్లో ప్రచారంలో వుండేది.

1. క్రైస్తవ లోకంలో సిలువ చరిత్ర

సిలువపై క్రీస్తు శరీరాన్ని చూపించే ఆచారం ఐదో శతాబ్దంలో ప్రారంభమైంది. నాల్గవ శతాబ్దం వరకు క్రైస్తవులు వట్టి సిలువనే వాడేవాళ్ళు ఈ వట్టి సిలువకూడ నాల్గవ శతాబ్దంలోగాని ప్రచారంలోకి రాలేదు. తొలిమూడు శతాబ్దాల్లో క్రైస్తవులు సిలువను చాల అరుదుగా వాడారు.

దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది యూదులూ గ్రీకు రోమను ప్రజలూ కూడ సిలువను ఎగతాళి చేసేవాళ్ళు. సిలువ నెక్కినవాడు శాపగ్రస్తుడని యూదుల భావం. కొరత వేయబడినవాడు వెర్రివాడని గ్రీకు రోమను ప్రజల తలంపు. అందుచే సిలువను బహిరంగంగా ప్రదర్శించడానికి తొలినాటి క్రైస్తవులు వెనుకాడారు. గాడిద తలగల మనిషి సిలువమీద వ్రేలాడుతున్నట్లుగాను, క్రింద ఒక నరుడు అతన్ని ఆరాధిస్తున్నట్లుగాను గీయబడిన చిత్రం ఒకటి ప్రాచీన రోమను భవనాల్లో కన్పించింది. "అలెక్స్ప్రెమెనోస్ తనదేవుణ్ణి ఆరాధిస్తున్నాడు" అని ఆ చిత్రం క్రింద వ్రాసివుంది. ఆ గాడిద తలగల మనిషి క్రీస్తే, అలా ఆ రోజుల్లో అన్యమతాలవాళ్ళు సిలువ వేయబడిన క్రీస్తుని ఎగతాళి చేసేవాళ్ళూ. కనుక ప్రాచీన క్రైస్తవులు సిలువను బహిరంగంగా చూపించేవాళ్ళు కాదు. రెండవది, తొలి మూడు శతాబ్దాల్లో వేదహింసలు వుండేవి. సిలువ చిహ్నం ద్వారా క్రైస్తవులు రోమను ప్రభుత్వానికి చిక్కిపోయేవాళ్ళు అందుచే వాళ్ళు దాన్ని వాడ్డానికి భయపడ్డాడు.

ఇంకా, క్రీస్తుని దిగంబరుణ్ణిగానే సిలువ వేసారు. ఆలాంటి దిగంబర క్రీస్తుని బహిరంగంగా చూపించడానికి క్ర్తెస్త్రవులు వెనుకాడారు. అందుకే క్రీస్తు రూపంగల సిలువలు ఐదవ శతాబ్దందాకా వాడుకలోకి రాలేదు. అంతకు ముందు క్రీస్తు దేహంలేని సిలువను వాడి అది జీవన దాయకమైనదని విశ్వసించేవాళ్ళు.

నాల్గవ శతాబ్దంలో రోమను చక్రవర్తి కోన్స్టంటయిను క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. అతడు యుద్దానికి ముందు ఆకాశంలో సిలువను దర్శించాడు. ఆ సిలువ