పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/93

ఈ పుట ఆమోదించబడ్డది

దేవుడు జ్ఞానస్నానం ద్వారా మనకందరికీ తండ్రి. కనుక మన ప్రార్థనలో ఈ నరులందరినీ స్మరించుకోవాలి. తండ్రి వీరందరికొరకు తన కుమారుని అప్పగించాడు కదా! దేవుని ప్రేమకు హద్దులు లేవు. ఆలాగే మన ప్రార్థనకు కూడ హద్దులుండకూడదు. ఇంకా, మనం క్రీస్తునీ అతని తండ్రినీ ఎరుగనివాళ్ళకొరకు కూడ ప్రార్ధించాలి. చెల్లాచెదరైన దేవుని సంతానాన్ని ఏకం చేసేవాడు క్రీస్తు - యోహా 11,52. భక్తులు పునీతులు నరులందరి కొరకు ప్రార్ధన చేసారు. మాయొక్క తండ్రి అన్నపదంలో ఇన్ని భావాలున్నాయి.

పరలోకమందుండే తండ్రి

     ఈ జపంలో వచ్చే "పరలోకం" అనే మాట ఎక్కడో వున్న ఏదో స్థలాన్ని సూచించదు. దేవుని గొప్పతనాన్నితెలియజేయడానికి ఇక్కడ ఈ మాటను వాడారు అంతే దేవుడు ఏ వొక్క తావులోనోగాక లోకమంతటా వుంటాడు. అతడు పరమ పవిత్రుడు. కనుక వినయాత్మలూ పశ్చాత్తాప హృదయులూ ఐన వారికి దగ్గరగా వుంటాడు. అగస్టీను భక్తుడు చెప్పినట్లు "దేవుడు పరలోకంలో వుండేవాడంటే భక్తిమంతుల హృదయాల్లో ఓ దేవాలయంలో లాగ వసించేవాడని భావం. దేవునికి ప్రార్ధన చేసేవాళ్ళ ఆ ప్రభువుని తమ హృదయంలో వసించమని అడుగుకోవాలని గూడ అర్ధం! కనుక పరలోకంలో వుండే దేవుడంటే మన హృదయాల్లో వసించే పవిత్ర ప్రభువనే అర్థం.
     పరలోకం దేవుని గృహం. మన పయనం గూడ ఆ యింటివైపే. పాపం వలన మనం ఆ యింటినుండి వెళ్ళిపోయాం. ఇపుడు పరివర్తనం వల్ల మళ్ళా ఆ యింటికి తిరిగి వస్తాం. క్రీస్తు ద్వారా యిపుడు పరలోక భూలోకాలు ఐక్యమయ్యాయి. పరలోకంనుండి దిగివచ్చిన మనుష్య కుమారుడే మనం మళ్ళీ పరలోకానికి ఎక్కిపోయేలా చేస్తాడు - యోహా 8,13, అతని మరణోత్థానాల్లో పాలుపొంది మనం పరమపదాన్ని చేరుకొంటాం.

ఈలా మనం పరలోకజపం చెప్పేపుడు ఈ లోకంలో వుండగానే పరలోకంలో క్రీస్తు చెంత ఆసీనులమై వున్నామని తెలియజేస్తాం - ఎఫే 2,6. ఆ దివ్యగృహం కొరకు నిరీక్షిస్తూ నిటూర్పు విడుస్తున్నామని సూచిస్తాం - 2కొ 5,2. ఎప్పడు కూడ మన యిల్ల ఇక్కడకాదు, అక్కడే

ఏడు విన్నపాలు

     పరలోకజపంలో మొత్తం ఏడు విన్నపాలున్నాయి. వీటిల్లో తొలిమూడు దేవుణ్ణి

స్తుతించేవి. చివరి నాలు మన అక్కరలను కరుణగల దేవునికి తెలియజేసికొనేవి. మొదటి మూడింటిలో దేవుని నామాన్ని రాజ్యాన్ని చిత్తాన్ని పేర్కొంటాం. ఇక్కడ మనలను గూర్చి