పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

1. ఐదురకాల ప్రార్థనలు

బైబులు భాష్యం -2

మనవిమూట

స్ధూలంగా జెప్పాలంటే బైబులు ప్రార్ధన ఐదువిధాలుగా వుంటుంది. మనకోసం మనం చేసికునే ప్రార్థన మనవి జపం. ఇతరుల కోసం మనం చేసేప్రార్థన విజ్ఞాపన జపం. మన పాపాలకు పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చుతూ చేసే ప్రార్ధన పశ్చాత్తాపజపం. ప్రభువు మనకు చేసిన మేలికార్యాలను తలంచుకొని అతనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రార్ధన కృతజ్ఞతా జపం. అతని మహిమ ప్రభావాలను తలంచుకొని అతనికోసమే అతన్ని స్తుతించి గౌరవించే ప్రార్ధన ఆరాధన జపం, కనుక ఈ సంచికలో క్రమంగా :

మనవి ప్రార్ధనం - నంబర్ల 1 - 9
విజ్ఞాపన ప్రార్ధనం - నంబరు 9A - 21
పశ్చాత్తాప ప్రార్ధనం - నంబర్లు 22 - 32
కృతజ్ఞతా ప్రార్ధనం - నంబర్లు 33 - 38
ఆరాధన ప్రార్ధనం- నంబర్లు 39 - 43

1. మనవి ప్రార్ధనం

1. కుమారుడు చేప నడిగితే = లూకా 11, 11-13.

అన్నిజపాలకంటేగూడ ప్రాథమికమైంది మనవిజపం, కనుక తొలుత మనవి జపం అంటే యేమిటో విచారిద్దాం. పసిబిడ్డ ఆకలితో వచ్చి చేప నడిగితే తండ్రి పామునందీయుడు. గ్రుడ్డునడిగితే తేలునీయడు. ఇక, భూలోకంలోని తండ్రులందరికంటె గూడ శ్రేషుడు కరుణా వాత్సల్యాలుగలవాడు, పరలోకంలోని తండ్రియైన ప్రభువు. కనుక మనం అడుగుకొనే యీవులన్నీ అ తండ్రి అనుగ్రహిస్తూనే వుంటాడు. పరలోకంలోని ప్రభువు తండ్రిలాంటివాడే. కాని భూలోకంలోని ప్రజలమైన మనం బిడ్డలాంటి వాళ్లంకావాలి. అక్కరగలిగినపుడు పసిబిడ్డ సంకోచించకుండా, భయపడకుండా, స్వతంత్రంగా, చనువుతో తండ్రివద్దకు వెళ్తుంటాడు. తండ్రికి తన అక్కరలను తెలియజేసి కుంటూంటాడు. ఈ పసిబిడ్డ మనస్తత్వంతోనే మనమూ ప్రభువును సమీపించాలి. మన మనవులను ఆ తండ్రికి నివేదించుకోవాలి. కావున మనవి జపంలోని ప్రధానాంశం, పసిబిడ్డ తండ్రిని సమీపిరచినట్లుగా తల్లీతండ్రియునైన దేవుణ్ణి సమీపించడం. సమీపించి పసిబిడ్డలాగ మన అక్కరలను ఆ తండ్రికి తెలియజేసికోవడం.