పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/88

ఈ పుట ఆమోదించబడ్డది

2. విశ్వాసమూ నమ్మికా దేవప్రేమా వృద్ధిజెందుతాయి.

3. దైవసాన్నిధ్యాన్ని గుర్తించగల్లుతాం. మన జీవిత సన్నివేశాల్లోనైతేనేమి, చుట్టుపట్ల జరిగే సంఘటనల్లోనైతేనేమి దేవుణ్ణి చూడగల్లుతాం.

4. దేవుణ్ణి ప్రధానమైన విలువగానూ మిగతా వాటినన్నిటినీ అప్రధానమైన విలువగానూ భావిస్తాం. పౌలు చెప్పినట్లు క్రీస్తుతో పోల్చిచూస్తే ఈ ప్రపంచంలోని విలువలన్నీ పెంట ప్రోవుతో సమానంగా కన్పిస్తాయి.

5. హృదయ పరివర్తనం కలుగుతుంటుంది. పాపభీతి జనిస్తుంది. మన పాపాలకు మనమే పశ్చాత్తాప పడతాం. హృదయశుద్ధికై ప్రాకులాడతాం.

6. సిలువలను అనుభవించడానికి జంకం, ఆత్మనిగ్రహాన్ని అవలంబిస్తాం. మనలను మనం తగ్గించుకొంటాం, కష్టాల్లోను వ్యాధి బాధల్లోను ఓర్పును చూపెడతాం.

7. సోదర ప్రేమను అలవరచుకొంటాం. స్నేహశీలురమౌతాం, ఇతరులను సులభంగా క్షమిస్తాం, ఇతరుల మేలుకై కృషి చేస్తాం, సేవాభావం అలవడుతుంది.

8. మన భగవదనుభవం క్రైస్తవ సత్యాలకూ బైబులు బోధలకు వ్యతిరేకంగాబోదు. అధికారంలోవున్న పెద్దలకు విధేయులమౌతాం. తిరుసభ ఆజ్ఞలకు కట్టుపడి వుంటాం.

9. సరళ స్వభావం, నిష్కాపట్యం, వినయం అలవడుతుంది.

10. ఇతరులకుగూడ క్రీస్తును తెలియజేయాలి అనే కోరికలుగుతుంది. ఏదో రూపంలో మన చుట్టపట్ల వున్నవాళ్లకు క్రీస్తును అందీయడానికి పూనుకొంటాం.

11. వివేకం అలవరచుకొంటాం, ఆత్మచే నడిపింపబడతాయి. పౌలు పేర్కొనిన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం మొదలైన ఆత్మఫలాలను పొందుతాం - గల 5, 22-23.

యథార్థమైన భగవదనుభవం కలవాళ్లల్లో ఈ లక్షణాలన్నీ కాక పోయినా, వీటిల్లో కొన్నయినా కన్పిస్తాయి. కనుక పండును జూచి చెట్టును నిర్ణయించవచ్చు.