పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/80

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కడపటి విన్నపంలో ఈ రెండవరకపు శోధనలనుండి, విశేషంగా పిశాచం తెచ్చిపెట్టే శోధననుండి, దేవుడు మనలను రక్షించాలనిభావం. మన శుద్ధికొరకు శోధనలేమో అవసరమే. మనంవద్దనుకొన్నా అవేమో రాకమానవు. కానిమనం వాటికి లొంగిపోకూడదు. ఈ విన్నపంలో అసలు శోధనలే రాకుండా వుండాలని గాదు, వాటికి లొంగిపోకుండా వుండాలని మాత్రమే ప్రార్ధిస్తున్నాం. అనగా దైవసహాయంతో ఈ జీవితంలో సంభవించే శోధనలను జయించాలని వేడుకొంటున్నాం.

దుష్టునినుండి మమ్మ రక్షించండి.

చివరివిన్నపంలో రెండు భాగాలున్నాయి. మొదటిభాగాన్ని మీద పరిశీలించాం. రెండవభాగంలో దుష్టునినుండి మనలను కాపాడాలని దేవుని వేడుకొంటున్నాం. లూకా సువార్తలో ఈ రెండవ భాగం లేడు. ఇక్కడ మూలాన్ని "కీడునుండి మమ్ము రక్షించండి" అనిగాని, లేదా "దుష్టునినుండి మమ్ము రక్షించండి" అనిగాని అనువదించవచ్చు. ఈ దుష్టుడు ఎవరోగాదు, నరజాతికి శత్రువైన పిశాచమే. అనగా పాపంలో కూలద్రోయాలనే తలంపుతో నరులను శోధించే పిశాచంనుండి మనలను కాపాడమని దేవునికి మనవి జేస్తున్నామన్నమాట. "కీడునుండి" అనే పదాన్ని స్వీకరించినట్లయితే పిశాచం మనలను పాపంలో కూలద్రోయకుండా వుండేలా తోడ్పడమని దేవుని మనవి జేస్తున్నాం.

చివరిరోజుల్లో క్రీస్తును విడనాడ్డమనే పెద్ద శోధనకూడ వస్తుంది - మత్త 24, 10. ఇదే మతభ్రష్టత, క్రీస్తుని నిరాకరించడమనే ఫరోరశోధననుండి కాపాడమనిగూడ ఈ చివరి విన్నపంలో ప్రార్థిస్తున్నాం.

8) క్రీస్తు ప్రార్ధనం

క్రీస్తు శిష్యులకు పరలోకజపాన్ని నేర్పించడం మాత్రమే గాదు. అతడు తనతరపునా శిష్యులతరపునా ఆ ప్రార్థనను స్వయంగా ప్రార్థించాడు. అదేలాగో చూద్దాం.

దేవుడు క్రీస్తుతండ్రికూడ. కనుక అతడు "పరలోకంలోని తండ్రీ" అని దేవుణ్ణి సంబోధించాడు. క్రీస్తు తండ్రిమహిమ కొరకు అంకితుడైనవాడు -యోహా 12, 28. కనుక "నీ నామం పూజింపబడునుగాక" అని మనవిచేసాడు. అతడు తండ్రి రాజ్యం కొరకు ఉవ్విళూరాడు. అందుచే “నీ రాజ్యం వచ్చునుగాక" అని వేడాడు. ఆ ప్రభువు దైవచితాన్ని నెరవేర్చడంకొరకే జీవించినవాడు. కావున "నీ చిత్తం నెరవేరాలి" అని విన్నవించు కొన్నాడు - లూకా 22, 42.