పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/70

ఈ పుట ఆమోదించబడ్డది

సువార్త 9,28. ఈ పర్వతంమీదనే మోషే యేలీయూ, ప్రభువు యెరూషలేములో మరణించాడాన్ని గూర్చి ముచ్చటిస్తారు. ఇలాంటి ముఖ్య ఘట్టానికి ముందు ప్రభువు మరి ప్రార్ధన చేయవద్దా? అలాగే ప్రభువు ఒలీవ వనంలో బాధలనుభవించడానికి ముందు గూడ ప్రార్థించాడు — లూకా 22, 41.

 ఈ సన్నివేశాలను బట్టి చూస్తే ప్రభు జీవితంలో, ప్రార్ధనమూ కార్యక్రమాలు రెండూ కలగలుపుగా వుండేవని తెలుస్తుంది. మనం నిత్యం ఆయాపనుల్లో మునిగిపోయి ప్రార్ధనం జేయడం మానివేస్తుంటాం. లేదా ప్రార్థనలో మునిగి పోయి ఆయా పనుల్లో పాల్గొనడమైనా మానివేస్తుంటాం. ఇవి రెండూ అపమార్గాలే. క్రీస్తు అవలంభించిన పద్ధతినిబట్టి చూస్తే మన జీవితంలో ప్రార్థనమూ పనీ రెండూ పూవూ తావీలాగ కలసి పోతుండాలి.

 5. ప్రభువు క్లిష్ట సమస్యల్లోను ఆపదల్లో చిక్కుకొన్నపుడూను ప్రార్థించేవాడు. అతడు ఐదువేలమందికి భోజనంపెట్టాక ప్రార్థించాడు. - మార్కు 6,46, ఎందుకంటే ఈ ప్రజలు ఉత్సాహం మిన్నుముట్టగా అతన్ని బలవంతంగా రాజును జేయబోయారు. కాని క్రీస్తు ఆలా రాజై కూర్చుంటే తాను వచ్చిన రక్షణకార్యాన్ని సాధించలేడుగదా! - యోహా 6,15. ఆలాగే అతడు విరోధులు తన్ను బంధించడానికి రాకముందూ ప్రార్ధించాడు - మార్కు 14, 35-39.

 ప్రభువు పేత్రుకోసం ముందుగనే ప్రార్జించాడు - లూకా 22, 81-82. ఈ వాక్యంలో పిశాచం పేత్రుని కళ్లంలోని జల్లెడలో గోదుమలను జల్లించినట్లుగా జల్లించాలని కోరుకొందని చెప్పబడింది. అనగా పిశాచం పేత్రుని బలంగా శోధించాలని కోరుకొంది అనిభావం. ఈ శోధనవల్లనే అతడు ప్రభుని ఎరుగనని ముమ్మారు బొంకాడు. కాని ప్రభుప్రార్ధనా ఫలితంగా అతడు మళ్ళా పశ్చాత్తాపపడగలిగాడు. ఇంకా, తన ఆపదనూ శిష్యుల ఆపదనూ పురస్కరించుకొని ప్రభువు ముందుగనే ప్రార్థించాడు - మార్కు 14, 36. శోధనల్లో ప్రవేశించకుండా వుండేందుకై ముందుగనే ప్రార్థించమనిగూడ శిష్యులను హెచ్చరించాడు - మత్త 26, 41.

కాని అన్నిటికంటె ముఖ్యమైంది సిలువమీది ప్రభు ప్రార్థన. అతడు చనిపోకముందు తండ్రిని ప్రార్థించాడు. తన ఆత్మను తండ్రి చేతుల్లోనికి సమర్పించుకొని గాని ప్రాణాలు విడువలేదు" - లూకా 23, 46. ఈ ఘట్టాలన్నీ కష్టకాలంలో ప్రభువు తన తండ్రిమీద ఎలా ఆధారపడేవాడో తెలియజేస్తాయి.