పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/49

ఈ పుట ఆమోదించబడ్డది

కలిగించవచ్చు. నా భవిష్యత్తును నాకు తెలుపకపోవచ్చు, ఇంకా యేమైనా చేయవచ్చు. ఐనా నీవుచేసేదేమిటో నీకు బాగా తెలుసు. నీవు నాకు చేసేకార్యం ఏదైనాసరే నాకు తప్పక మేలుచేస్తుంది. కనుక నేను నిన్ను నమ్మి జీవిస్తాను.

6. పని బాగా చేసేందుకు

పనివారికి మాదిరిగావుండే మహిమగల పునీత జోజప్పగారా! నేను నా పనిని బాగాచేసి నా పాపాలకు ప్రాయశ్చిత్తంచేసికొనే భాగ్యాన్ని సంపాదించిపెట్టు. నేను నా పనిని శ్రద్ధతోను ఉత్సాహంతోను చేసేలా చేయి. నా పనిద్వారా దేవుడు నాకిచ్చిన శక్తిసామర్థ్యాలను వృద్ధిచేసికొనేలా చేయి. ఓ క్రమపద్ధతిలో నెమ్మదిగా ఓర్పుతో నా పనిని నేను చేసికొనేలా చేయి. మంచి ఉద్దేశంతో నా పనిని చేసేలా చేయి. నేను ఓ దినం చనిపోతాననీ అటుపిమ్మట నా పనినిగూర్చి దేవునికి ఖండితమైన లెక్క ఒప్పజెప్పాలనీ గ్రహింతునుగాక. నేను చేయవలసిన పనిని చేయనందుకూ, సోమరితనంగా వుండిపోయినందుకూ, విజయం కలిగినప్పడు మిడిసిపడినందుకూ దేవునికి లెక్కఒప్పజెప్పాలని గ్రహింతునుగాక, నిన్ను ఆదర్శంగా బెట్టుకొని మరియమాతద్వారా నా పనినంతా క్రీస్తుకి అర్పించుకొందునుగాక. నేను మంచి పనివాడ్డిగా తయారగుదునుగాక.

7. ప్రభువే నాకు సర్వస్వం

ప్రభూ! నేను నన్ను నిన్నుగూడ తెలిసికోందునుగాక. నిన్ను దప్ప మరిదేన్ని కోరుకోకుందునుగాక. నన్నునేను మరచిపోయి నిన్ను గుర్తుంచు కొందునుగాక. ప్రతికార్యం నీ కొరకే చేయుదునుగాక. నన్ను నేను తగ్గించుకొని నిన్ను హెచ్చింతును గాక. నిన్ను దప్ప మరి దేన్నిగూర్చి ఆలోచింపకుందునుగాక, నా స్వార్ణాన్ని వదలుకొని నీ కొరకు జీవింతునుగాక, నాకు సంభవించే మంచిచెడ్డలన్నీ నీవల్లనే జరిగాయని గ్రహింతునుగాక. నన్ను నేను త్యజించుకొని నిన్ను వెంబడింతును గాక, ఎల్లప్పుడు నిన్ననుసరించాలని కోరుకొందునుగాక, నానుండి నేను పారిపోయి నీ మరుగు జొత్తునుగాక. నేను నీ రక్షణకు నోచుకొందును గాక. నీ నుండి వేరుపడుటకు ఇష్టపడకుందునుగాక. నీ వెన్నుకొనిన వారిలో నేనును ఒకడనగుదును గాక. నా బలముపై నేను ఆధారపడక నిన్ను నమ్మి జీవింతునుగాక, నీకు విధేయుడనై యుందునుగాక, నన్నుకరుణతో వీక్షించి నేను నిన్ను ప్రేమించేలా చేయి. నా బుద్ధికి ప్రబోధం కలిగించి నేను నిన్ను అర్థంచేసికొనేలాచేయి. నా చిత్తాన్ని ప్రేరేపించి నేను నిన్ను వెదికేలాచేయి. నీవు నన్ను పిలవగా నేను నీ చెంతకు వచ్చేలా చేయి. నేను నీ ప్రేమను పొంది శాశ్వతనందాన్ని అనుభవింతునుగాక.