పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/29

ఈ పుట ఆమోదించబడ్డది

2.మనవి ప్రార్ధనం

బైబులు భాష్యం – 98

విషయసూచిక

1.మనవి ప్రార్ధనం

2. ప్రార్ధనా విధులు

3.ప్రార్థనకు సహాయకారులు

1. మనవి ప్రార్ధనం

1. క్రీస్తే మనకు ప్రార్థన నేర్పుతాడు

క్రీస్తు ఓచోట ఒంటరిగా ప్రార్ధనం చేసికొంటున్నాడు. అతడు జపం చేయడం చూచి శిష్యులు తామూ జపంచేయాలనుకొన్నారు. కాని వారికి ప్రార్థన కుదరలేదు. కనుక వాళ్లు ప్రభూ! స్నాపక యోహాను తన శిష్యులకు నేర్చినట్లుగా నీవు మాకుకూడ ప్రార్థన నేర్చించమని అడిగారు. క్రీస్తు మీరు ఈలా ప్రార్ధించండి అని వారికి తన జప విధానం నేర్పించాడు. అదే పరలోక జపం - లూకా 11, 1-4.

ఆ రోజుల్లో ఒక్కో రబ్బయికి ఒక్కో ప్రార్ధనా విధానముండేది. స్నాపక యోహాను ఒక రబ్బయిగా తన శిష్యులకు కొంతకాలం ప్రార్ధనం నేర్పాడు. అతడు గతించాక అతని శిష్యులు యోహాను యాకోబు క్రీస్తు శిష్యులయ్యారు. క్రీస్తకూడ ఓ రబ్బయి. కనుక యోహాను మొదలైన శిష్యులు క్రీస్తుని ఇక్కడ తమకు ప్రార్ధనం నేర్పమని అడిగారు. ప్రభువు వారికి తన జప విధానాన్ని నేర్పాడు, అతని విధానం పరలోక జపంలో వుంది.

ఈనాడు మనకు ప్రార్థన నేర్పేదికూడ ప్రభువే, అతనిలా మరెవ్వరూ మనకు జపం నేర్పించలేరు. కనుక మనంకూడ ఆ శిష్యుల్లాగే ప్రభూ! నీవు మాకుకూడ ప్రార్ధన నేర్పించు అని క్రీస్తుని నిరంతరం అడుగుకోవాలి. ఒకసారీ రెండుసార్లూ కాదు. చాలసార్లు అడుగుకోవాలి. అదీ ఆశతో, ప్రభువు అనుగ్రహంవల్ల మనంకూడ జపం నేర్చుకొంటాం.

2. ప్రార్ధనంలో మొదట దేవుడు

క్రీస్తు శిష్యులకు ఏలా ప్రార్ధనం నేర్చించాడు? అతడు వారికి పరలోక జపాన్ని బోధించాడు, అతని ప్రార్ధనా విధానమంతా ఆ జపంలో ఇమిడివుంది. "ఆయన వారితో