పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/274

ఈ పుట ఆమోదించబడ్డది

నీ శిష్యులకు కొలతబద్ధ క్రియాశుద్దికాని
నటనా, వేషధారణా, ఆడంబరమూ కాదని గుర్తించేవరాన్ని
నీ సేవకులమైన మా కెల్లరికీ దయచేయి.

57. సువిశేష సేవ

యోహా 20,21. 15,5. మత్త 4,20. ఎఫే 4,16.

యిర్మీ 20,9. 1కొరి 9,16. 2కొ 12,15.

క్రీస్తూ! ఉత్థానానంతరం నీవు శిష్యులకు దర్శనమిచ్చినపుడు
తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్ము పంపుతున్నానని పల్మావు
తండ్రి పంపగా దైవరాజ్యాన్ని గూర్చి
బోధించడానికి వచ్చిన మహా ప్రేషితుడవు నీవు
మేము నీలోనికి జ్ఞానస్నానం పొందినపడే
నీ ప్రేషిత ధర్మాన్ని స్వీకరిస్తాం
కనుక నీలాగే మేముకూడ దైవరాజ్యాన్ని గూర్చి ప్రకటించాలి
ఈ కార్యంలో నీవు తండ్రి నుండి బలాన్ని పొందినట్లే
మేమూ నీ నుండి సత్తువను పొందాలి
కనుకనే నీవు ద్రాక్షతీగ ఉపమానాన్ని వివరించి
ద్రాక్ష కొమ్మలు తల్లితీగ నుండి సారాన్ని పొందినట్లే
మేమూ నీనుండి వరప్రసాద బలాన్ని పొందాలని వాకొన్నావు
నీ నుండి వేరైనపుడు
మేమెందుకు పనికిరామనిగూడ నుడివావు
ఇంకా నీవు పండ్రెండుమంది శిష్యులను ఎన్నుకొన్నపుడు
ఇంతవరకు విూరు చేపలను పడుతూ వచ్చారు
కాని యికమిూదట మిమ్ము మనుష్యులను పట్టే
బెస్తలను చేస్తానన్నావు
కనుక నేడు మేము దైవరాజ్యానికి నరులను సేకరించాలి
పెక్కుమంది విశ్వాసులను ప్రోగుజేసి శ్రీసభను వ్యాప్తిజేయాలి
శరీరంలో అవయవాలన్ని కష్టపడి పనిచేసి
ఆ శరీరం దృఢంగా పెంపొందేలా చేస్తాయి
అలాగే జ్ఞానదేహానికి అవయవాలైన మేముకూడ కృషిచేసి
ఆ యాధ్యాత్మిక దేహాన్ని పెంపులోకి తీసుకురావాలి
ప్రభూ! మాకు ప్రేషిత సేవమిూద గాఢమైన కోర్కెపట్టించు
వేదబోధపట్ల నీ భక్తులకు దయచేసిన తపనను