పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/272

ఈ పుట ఆమోదించబడ్డది

కాని దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడు
నన్ను విూకంటె ముందుగా ఈ కానిదేశానికి పంపి
ఈ కరువు కాలంలో మాకు తిండి దొరికేలా చేసాడు
కనుక నేను విూ యపరాధాన్ని పూర్తిగా క్షమిస్తాను
మిమ్ము ఆదరిస్తాను విూరేవిూ భయపడకండి" అని పల్మాడు
ఈ యోసేపు ఎంత క్షమాబుద్ధికలవాడు!
మేమైతే మా కపకారం చేసినవాళ్ళమిూద మండిపడతాం
కారాలు విూరాలు నూరుతూ నిషురాలు పలుకుతాం
మా శత్రువులకు కసిదీర కీడు చేయాలనిపిస్తుంది
ఇక మేము వాళ్ళను క్షమించేదెక్కడ?
వాళ్ళకు మేలు చేసేదెక్కడ?
కాని ప్రభూ! ఇది పద్ధతి కాదు
అపకారికి వుపకారం నెపమెన్నక చేస్తేగదా గొప్ప!
చంపదగిన శత్రువు చేతికి జిక్కితే
కీడుజేయక మేలుజేసి పంపితేగదా మాన్యత?
మాది రాక్షస ప్రవృత్తి కనుక శత్రువుని క్షమించలేం
తోడి నరుణ్ణి మన్నించాలంటే మాకెంతో కష్టంగా వుంటుంది
కనుకనే నీవు సిలువమిూద వ్రేలాడుతూ
నిన్ను హింసించే శత్రువుల కొరకు ప్రార్థించావు
మేము మా పగవారిని మన్నించాలని బోధించావు
నీవు బోధించిన గొప్ప శిష్యధర్మాల్లో క్షమాధర్మమొకటి
తోడివాణ్ణి మన్నించినవాడు దివ్యుడుకాని నరుడు కాడు
కనుక నిన్నాదర్శంగా బెట్టుకొని యెంత కష్టమైనాసరే
ఈ క్షమాగుణాన్ని సాధించే ప్రయత్నం చేస్తాం.

56. ప్రేషిత ధర్మాలు

మత్త 5,13-16

ప్రభూ! నీవు పర్వతప్రసంగంలో ప్రేషితధర్మాలను వివరించావు
నీ శిష్యులు భోజనంలో వుప్పులా వుండాలన్నావు
దీపస్తంభంమిూద పెట్టిన దీపంలా వెలగాలన్నావు
కొండమిద కట్టిన పట్టణంలా విరాజిల్లాలన్నావు
వుప్పు భోజనానికి రుచినిస్తుంది, దాన్ని పదిలపరుస్తుందికూడ
అలాగే మేమూ నీ వపదేశాలనే రుచిని లోకాని కందీయాలి