పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/268

ఈ పుట ఆమోదించబడ్డది

అది తన తరపున తాను మా జీవితానికి అగ్గిపెడుతుంది
నరులు పాములనూ పులులనూ అదుపులో వుంచుకొంటారు
కాని యే నరుడూ నాల్మను అదుపులో పెట్టుకోలేడు కదా!
జిహ్వనుండి అమృతమయమైన వాక్కులు వెలువడాలి
కాని దానినుండి వూరే విషం అంతాయింతా కాదు
ఈ నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తాం
దీనితోనే దేవుని రూపం ధరించిన నరుణ్ణి శపిస్తాం
ఒకే చెలమనుండి తీయని నీళూ ఉప్పనీళూ ఊరతాయా?
ఒకే చెట్టునుండి తీయని పండల్లా చేదు కాయలూ కాస్తాయా?
కాని ఒకే నాలుకనుండి దీవెనలూ శాపాలూ వెలువడ్డం విడ్డూరం
ప్రకృతిలో ఈలాంటి వైరుధ్యం మరెచటా కన్పించదు
ప్రభూ! ఈ నాలుకతో ఎందరిని ఆడిపోసుకొంటాం
ఎందరి మనసు నొప్పిస్తాం,
ఎన్ని పచ్చని సంసారాలు పాడుచేస్తాం
ఎన్ని తగాదాలు తెచ్చిపెట్టుకొంటాం
దీనివల్లనే మాకు చావుగాని బ్రతుకుకాని సిద్ధిస్తాయి
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది కదా!
కనుక కీర్తనకారునిలాగే మేముకూడ
"ప్రభూ! మేము దుర్భాషలాడకుండా వుండేలా
మా పెదవులకు తాళం వేయి" అని ప్రార్ధిస్తున్నాం
నీ యనుగ్రహం లేనిదే ఈ చండాలపటవయవం మాకు లొంగదు.

52. ఇచ్చేవాడు ధన్యుడు

అచ 20,35. మత్త 10,42. మత్త 6,254.

ప్రభూ! నేనెప్పడూ ఎవరివద్ద యేమి దొరుకుతుందా
ఎవరి చెంతనుండి యేమి గుంజుకొందామా అని చూస్తుంటాను
ఒకడికీయడానికి మాత్రం చచ్చినా ఒప్పకోను
నాది యేదైనా అన్యుడి కీయాలంటే
శరీరాన్ని కోసియిచ్చినంత కష్టంగా వుంటుంది
అవును తీసికోవడం తీపి, ఈయడం మహాకష్టం
ఐనా నీవిచ్చేవాడివికాని తీసికొనేవాడివి కావు
నీ కత్యంత ప్రీతిపాత్రుడైన క్రీస్తునే మా కిచ్చావు
నీ యాత్మను మా హృదయాల్లోకి పంపావు