పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/265

ఈ పుట ఆమోదించబడ్డది

తోడి నరుడ్డి ఆదరించాలంటే మాలోని స్వార్థం అడ్డదగులుతుంది
మేము ఇతరులనుండి తీసికోగోరుతాంగాని
ఇతరుల కీయడానికి ఇష్టపడం
කිසරි తోడివాణ్ణి ఎందుకు పట్టించుకొంటాం?
కనుక మాలోని స్వార్ణాన్ని చంపుకొని
మమ్మ మేము త్యజించుకొంటేనేగాని
సోదరప్రేమను కొలదిగానైనా పాటించలేం
క్రైస్తవ జీవితంలోకెల్లా సోదరప్రేమే
కష్టమైన కార్యం అన్పిస్తుంది
కనుకనే నీవు దీనిని నీ శిష్యులకు గుర్తుగా నిర్ణయించావు
అద్భుతాలు చేసేవాళ్ళూ కాదు
పిశాచాలను పారద్రోలేవాళ్ళూ కాదు
వ్యాధులను కుదిర్చేవాళూ కాదు
ప్రార్ధనా సభలు నడిపించేవాళ్ళూ కాదు
గ్రంథాలు వ్రాసి ఉపన్యాసాలిచ్చేవాళ్ళూ కాదు
సాంఘికసేవ చేసేవాళ్ళూ కాదు
మరి సోదరప్రేమను పాటించేవాల్లెవరో
వాళ్లుమాత్రమే నీ నిజశిష్యులు
క్రైస్తవ జీవితంలోకల్ల యిది కష్టమైన కార్యం
కావున యిదొక్కటే నీ శిష్యులకు ముఖ్యలక్షణం.

49. వెలుగుబాటు

1యోహాను 2,10-11. 4,19-21

తండ్రీ! నీవు చీకటి యేమాత్రము లేని నిండువెలుగువి
ద్వేషము అణుమాత్రము లేని పరిపూర్ణ ప్రేమవి
నీ గారాబు సుతుని మాకు ప్రసాదించడంలోనే
మాపట్ల నీకుగల ప్రేమ వ్యక్తమైంది
ఆ ప్రభువు ముఖప్రకాశం మామిూద సోకగానే
మా హృదిలోని తమస్పూ ద్వేషమూ పటాపంచలైపోయి
నీ వెలుగూ అనురాగమూ మాలో చోటుచేసికొంటాయి
తోడినరుద్ధి ప్రేమించలేనివాడు
దట్టమైన కారుచీకటిలో పయనించేవాడు
ఇరుగుపొరుగువారి నాదరించే పుణ్యపురుషులే
జ్యోతిర్మార్గంలో నడచే ధన్యాత్ములు