పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/264

ఈ పుట ఆమోదించబడ్డది

సొలోమోను అప్పడే సింహాసన మధిష్టించాడు
ప్రజలను చక్కగా పరిపాలించడం అతని బాధ్యత
కనుక జనులను మంచిచెడ్డలెంచి పరిపాలించే వివేకం
ప్రసాదించమని అతడు నీకు మనవి చేసాడు
ఆ రాజు స్వార్దబుద్దితో దీర్గాయువూ, శత్రునాశమూ
సిరిసంపదలూ మొదలైన వరాలేమిూ కోరుకోక
ప్రజాపాలనానికి వలసిన వివేకం అడిగాడు కనుక
అతని వేడికోలు నీకెంతో ప్రీతి కలిగించింది
నీవతన్ని దీవించి మహాజ్ఞానిని చేసావు
త్రికాలాలలోను అతనిలాంటి మహాప్రభువు లేడనిపించావు
అడగకపోయినా ఇతర వరాలుకూడ అతనికి దయచేసావు
మేమైతే వెర్రిమొర్రి కోరికలన్నీ కోరుకొంటాం
పిచ్చిపిచ్చి ప్రార్థనలన్నీ చేస్తుంటాం
కాని అవసరమైన దొక్కటే - కర్తవ్యపాలనం
మూ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే చాలు
మేము నీ కెంతైనా ప్రియపడతాం
నీ చిత్తాన్ని పాటించి నీ యాజ్ఞకు బదులమై
ఈ జీవితంలో నీవు మా కొప్పజెప్పిన పనిని సంతృప్తికరంగా
చేసిముగిస్తే నీవు మమ్మ తప్పక మెచ్చుకొంటావు
మే మడగకపోయినా ఇతర వరాలుకూడ దయచేస్తావు
కనుక మేము చేయవలసిన కార్యాలను
చిత్తశుద్ధితో చేసే సామర్థ్యాన్ని ప్రసాదించమని
ఏ ప్రాద్దు నిన్ను వేడుకొనే వివేకం మాత్రం మాకు దయచేయి.

48. శిష్యలక్షణం

యోహా 13,35

ప్రభూ! మేము ఒకరినొకరం ప్రేమిస్తే
అప్పడు లోకం మమ్మ నీ శిష్యులనుగా
గణిస్తుంది అని నుడివావు
లోకంలో సోదరప్రేమ లేదు, నరునికి నరుడు తోడేలు
కనుక సోదరప్రేమను పాటించేవాళ్ళను జూచి లోకం విస్తుపోతుంది
వీళ్లు క్రీస్తు శిష్యులని చెప్పకొంటుంది
కాని సోదరప్రేమను పాటించడం సులభమైన కార్యం కానేకాదు