పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/259

ఈ పుట ఆమోదించబడ్డది

43. జీవితంలో తుఫానులు

మత్త 8,23-27

ప్రభూ! నీవు శిష్యులతో గలసి
గలిలయ సరస్సులో ప్రయాణం చేస్తూండగా
పెనుతుఫాను పట్టుకొని అలలు ఉవ్వెత్తుగా లేచాయి
ఓడ అతలాకుతలమై మునిగిపోవడానికి సిద్ధమైంది
అప్పడు నీవు నావలో ఓ మూల పండుకొని నిద్రపోతూండగా
శిష్యులు భయకంపితులై నీ చెంతకు వచ్చి నిన్ను నిద్రలేపారు
ప్రాణాపాయంలో వున్నాం మమ్మ రక్షింపమని మనవిచేసారు
నీవు వాళ్ళకు ధైర్యంచెప్పి తుఫానునూ సాగరాన్ని శాసింపగా
గాలివాన సమసిపోయి వాతావరణం ప్రశాంతమైంది
ఈలా ప్రకృతి శక్తులుకూడ నీకు లొంగడంజూచి
శిష్యులు నిన్ను వేనోళ్ళ కొనియాడారు
ఈ సంఘటనాన్ని మననం బేసికొంటూంటే
నేడు మా జీవితంలో సంభవించే తుఫానులు జ్ఞప్తికివస్తున్నాయి
వ్యాధిబాధలు మమ్మ నిరంతరం క్రుంగదీస్తుంటాయి
పేదరికంవల్లా చాలీచాలని జీతాలవల్లా తీరని యప్పలవల్లా
మేము నానాయాతన లనుభవిస్తూంటాం
ఓవైపు మా శత్రువులు నిర్దయతో మమ్మ పీడిస్తూంటే
మరోవైపు మా మిత్రులు మాకు ద్రోహంచేసి
దుఃఖం కలిగిస్తూంటారు
తలవని తలంపుగా కలిగిన అపార్ధాలవల్ల
మనసు వికలమౌతూంటుంది
ఎదిగిన పిల్లలు మాట విననందునా
ఒకోసారి తల్లిదండ్రులమైన మాకే మనసులు కలవనందునా
కుటుంబంలో శాంతి అంతరించి యిల్ల నరకప్రాయమౌతుంది
ఇంకా మాకు నీవిూద ఉండవలసిన భక్తి లేనందునా
మేము నీ వరప్రసాదానికి నోచుకోనందునా
మా హృదయాల్లో సంతోషమూ సంతృప్తి కరవైపోతూంటాయి
మా జీవితాలు ఎండిన నేలలాగ
మోడువారిన చెట్టులాగ తయారౌతాయి
మేము నీ చెంతకు రాగోరిగూడ నీకు దూరమౌతూంటాం,
ఈలాంటి పెనుతుఫానులు మా జీవితంలో చాలా వసూంటాయి