పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/249

ఈ పుట ఆమోదించబడ్డది

33. మోక్షారోహణమూర్తి

యోహా 13,117, 1-5, హెబ్రే 8,1-2 కొలో 3.1-2.

ప్రభూ! నీవు ఈ లోకాన్నివీడి తండ్రిచెంతకు వెళ్ళే గడియ
సమిూపించిందని గుర్తించి మింటివైపు కన్నులెత్తి
"తండ్రీ! ఇక నీ తనయుని మహిమపరచు
నీవు నా కప్పగించిన పని పూర్తిచేసాను
నేను నిన్ను మహిమపరచినట్లే నీవూ నన్ను మహిమపరచు"
అని విన్నవించావు - ఆ ప్రార్ధనా ఫలితమో అన్నట్ల
తండ్రి నిన్ను సిలువమిూద మహిమపరచాడు
నీకు ఉత్తాన మహిమను దయచేసాడు
తదనంతరం నీవు శిష్యులతో ఓలివు కొండకు వెళ్ళి
అక్కడి నుండి మోక్షారోహణం చేసావు
దివ్యతేజస్సుతో మేఘమండలాన్ని చీల్చుకొని
స్వర్గసీమ కెగసిపోయి దివ్యధామాన్ని చేరుకొన్నావు
తండ్రి కుడిపార్యాన సింహాసనాసీనుడవయ్యావు
ఈలా నీవు దివ్యలోకాన్ని ప్రవేశింపగా నీ భక్తులమైన మేము
ఇంకా ఈ మంటివిూదనే జీవితయాత్ర సాగిస్తున్నాం
కాని నీలోనికి జ్ఞానస్నానం పొందిన మేము కూడ
ఓనాడు నిన్ను చేరుకొంటాం, నీ వైభవంలో పాలుపొందుతాం
కనుక మేమియా లోకంలో వసిస్తూన్నపుడు కూడ
స్వర్గంలో సింహాసనాసీనుడవై యున్న నీవైపు దృష్టి మరల్చాలి
ఈ యిహలోక వస్తువ్యామోహం నుండి వైదొలగి
ఆ దివ్యలోక సౌభాగ్యాలమిూద మనసు లగ్నం చేసికోవాలి
నీ భక్తుడైన ఇరినేయసు నుడివినట్లుగా
మృగాలు తల నేలవైపు వంచి నడుస్తాయి
ఆ నడక ద్వారానే అవి
తామిూ మంటిలో కలిసిపోతామని సూచిస్తాయి
కాని నరుడొక్కడు మాత్రం శిరస్సు పైకెత్తి నడుస్తాడు
ఆ నడక ద్వారానే అతడు
తాను ఊర్ధ్వలోకానికి చెందినవాడనని సూచిస్తాడు
కావున మోక్షారోహణమూర్తివైన ప్రభూ! నీ భక్తులమైన మాకు
ఈ మంటి కట్టిపెట్టుకొని బ్రతికే దౌర్భాగ్యం పట్టనీకు
నిరంతరం స్వర్గసంపదల నాశించే భాగ్యం దయచేయి.