పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/248

ఈ పుట ఆమోదించబడ్డది

32. విత్తనం మొలకెత్తినట్లే

మత్త28,1-6, ఆది 2,7. రోమా 8,11. యోహా 6,54

ప్రభూ! నీ మృతదేహాన్ని సమాధిలో పదిలంచేసాక
ఆదివారం వేకువనే పుణ్యాంగనలు సమాధిని దర్శింపవచ్చారు
కాని అప్పటికే నీవు ఆత్మశక్తితో ఉత్థాన మయ్యావు
తొలుత తండ్రి పిడికెడు మట్టిముద్దలోనికి శ్వాస నూదగా
ఆ మృత్పిండం జీవించే ప్రాణి ఐoది, అతడే తొలి ఆదాము
మల్లా తండ్రి నీ మృతదేహంలోనికి తన శ్వాస నూదాడు
ఆ శ్వాసే జీవశక్తిని ప్రసాదించే పరిశుద్ధాత్మ
ఆ యాత్మశక్తితోనే రెండవ ఆదామువైన నీవుకూడ
అద్భుతంగా ఉత్తానుడవయ్యావు
తండ్రి ఏ ఆత్మతో మృతుడవైన నిన్ను సజీవుణ్ణి చేసాడో
ఆ యాత్మతోనే మాకుకూడ ఉత్తాన భాగ్యం దయచేస్తాడు
మాకు సరిగా అర్థం కాకపోయినా
ఈ సత్యాన్నేమో భక్తిభావంతో విశ్వసిస్తూన్నాం
అసలు ఈ జగత్తంతా ఉత్థాన తేజస్సుతో భాసిల్లుతూంది
రోజూ సూర్యుడు అస్తమించి మళ్ళా ఉదయించడం లేదా?
రేయిరేయి నింగిని చుక్కలు పొడవడం లేదా?
భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడం లేదా?
నరికి నేలలో పాతిన కొమ్మ మళ్ళా బ్రతికి పెరగడం లేదా?
ఆకురాల్చిన చెట్ల మళ్ళా చిగిర్చి పూలుపూయడం లేదా?
అలాగే మoటిలో పాతిపెట్టిన దేహం మాత్రం
మళ్ళా యెందుకు లేవకూడదు?
విత్తనంలో జీవశక్తి వుండబట్టే అది మళ్ళా మొలకెత్తుతూంది
దేహంలో మాత్రం అలాంటి జీవశక్తి లేదా?
నీ వేమని బోధించావు?
నా శరీరాన్ని భుజించేవాడ్డి నే నంతిమదినాన లేపుతానన్నావు
కనుక ఆ దివ్యసత్రసాదమే
మా దేహమనే బీజంలోని జీవశక్తి ఔతుంది
అదే అద్భుతమైన ఆత్మశక్తి కూడ
శిథిలమై భూగర్భం చేరిన మా తనువు ఆ దివ్యశక్తితోనే
అంతిమ దినాన మళ్ళా ఓ విత్తనంలా మొలకెత్తుతుంది
మృత్యుంజయుడవైన నీవల్ల మాకు ఉత్థానప్రాప్తి సిద్ధిస్తుంది.