పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/244

ఈ పుట ఆమోదించబడ్డది

వీళ్లు యూదులేగాని అన్యజాతివాళ్లు
క్రైస్తవమతంలో చేరాలనుకోలేదు
అంతియోకయ కేంద్రానికి బర్నబా పౌలులు పెద్దలు
వీళ్ళు అన్యజాతి ప్రజలు కూడ
క్రైస్తవ ధర్మం చేపట్టాలనుకొన్నారు
ఓదినం అంతియోకయ సమాజంలో
క్రైస్తవులు ప్రార్ధన చేస్తూండగా
బర్నబాను పౌలును నేను సంకల్పించిన పనికొరకు పంపండని
నీవొక భక్తునిచే ఆ ప్రార్థనాసమాజంలో ప్రవచనం చెప్పించావు
అచటి విశ్వాసులు నీ ప్రబోధాన్ని అర్థంచేసికొని
బర్నబా పౌలులను ప్రేషిత సేవకు పంపారు
వాళ్ళు వెళ్ళి యూదులుకాని అన్యజాతి ప్రజలకు
క్రీస్తుని బోధించారు
గ్రీకు రోమను ప్రజలకు జ్ఞానస్నానమిచ్చి శ్రీసభను వ్యాప్తిజేసారు
ఈలా నీవు నిరంతరం ప్రేషితులను వేదబోధకు పంపిస్తుంటావు
నీ ప్రేరణంవల్ల పూర్వం విదేశాలనుండి వచ్చిన గురువులు
మా ప్రాంతాల్లోగూడ వేదబోధ చేసి శ్రీసభను స్థాపించారు
వాళ్ళ చలవవల్ల నేడు మేము క్రైస్తవులంగా జీవిస్తున్నాం
ఈ పరమోపకారానికి కృతజ్ఞతగా మా తరపున మేము కూడ
సువిశేషబోధ చేసే వివేకాన్ని మాకు ప్రసాదించు
మాకు చేతనైన పద్ధతిలో మేము కూడ యిరుగుపొరుగువారికి
క్రీస్తును చాటిచెప్పాలనే కోర్మెను మా హృదయాల్లో పుట్టించు
మేము నోటిమాటలతో క్రీస్తును బోధించలేనప్పుడుగూడ
మామంచి జీవితంద్వారానే ఆ ప్రభువుకి సాక్ష్యం పలికేలా చేయి


ఇంకా నీవు మా అంతరాత్మలో వుండి మమ్ము నడిపిస్తుంటావు
పాడుపనులు చేయాలనుకొన్నపుడు
మా మనస్సాక్షి మమ్మ మందలిస్తుంది
మంచిపనులు చేసినపుడు మా అంతర్వాణి మమ్మ మెచ్చుకొంటుంది
నీవు నరుల హృదయాల్లో దీపంలా వెలుగుతూ