పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/240

ఈ పుట ఆమోదించబడ్డది

నీవు నిరంతరం మా అంతరంగంలో నెలకొని వుంటావు
నరుడు నిధిని భద్రంగా దాచుకొన్నట్లే
మేమూ నిన్ను మా హృదయపేటికలో పదిలంగా దాచుకోవాలి
నిప్పమిూద వూదగానే మంటలు లేచినట్ల
మేము నిన్ను స్మరించుకొని నీకు ప్రార్థనం జేసికొనగానే
నీవు మా హృదయంలో మహాజ్యోతివిగా ప్రజ్వరిల్ల
మహావాయువువైన నీవు మమ్మ నీయద్భుతశక్తితో నడిపించు
దైవాగ్నివైన నీవు మమ్మ దైవసాన్నిధ్యంతో నింపు
మాలోని పాపమాలిన్యాన్ని దహించి
మా హృదయాలను శుద్ధిచేయి
జిహ్వారూపుడవైన నీవు మేము క్రీస్తుని స్తుతించేలా చేయి
ఆ ప్రభువుని లోకానికి చాటిచెప్పే శక్తినిగూడి ప్రసాదించు
సదుపదేశం, దైవభక్తి దృఢత్వం, దైవభీతి
తెలివి, వివేకం, విజ్ఞానం అనే సప్తవరాలను మాకు ప్రసాదించు
మా హృదయంమిూద క్రీస్తురూపాన్ని ప్రస్ఫుటంగా చిత్రించు
మేము జీవితాంతమూ ఆ ప్రభువుకి
సేవలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు.

27. క్రీస్తుని ముద్రించే ఆత్మ

ఎఫే 1,13. 1కొ 6,19. లేవీ 19,2. రోమా 5,5.

ఆత్మమా! మేము జ్ఞానస్నానం పొందినప్పడే
నీవు మాలోకి విచ్చేసి
మా హృదయాలవిూద క్రీస్తుని ముద్రిస్తావు
పూర్వం యజమానులు బానిసల భుజాలమిూద తమ ముద్రవేసి
వాళ్ళను తమ యధీనంలో వుంచుకొనేవాళ్ళ
జ్ఞానస్నానానికి.పూర్వం మేము
పిశాచమనే యజమానునికి చెందినవాళ్ళం
ఈ సంస్కారానంతరం క్రీస్తనే యజమానునికి చెందుతాం
మేము నిరంతరం క్రీస్తు భక్తులంగా జీవిస్తూ