పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/239

ఈ పుట ఆమోదించబడ్డది

జీవజలప చెలమనుండి స్వేచ్చగా నీళ్లు త్రాగనిస్తాడు

మేము నీళ్లు త్రాగి మా భౌతిక జీవితాన్ని నిలబెట్టుకొన్నట్లే

జీవజల స్వరూపుడైన ఆత్మను పానంజేసి

మా యాధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టుకోవాలి

కనుక ఆ యాత్మను సమృద్దిగా పానంజేసే భాగ్యాన్ని

జీవజలదాతయైన క్రీస్తుద్వారానే మాకు ప్రసాదించు.

26. శిష్యులమీదికి దిగివచ్చిన ఆత్మ

అచ 2,1-4 నిర్ణ 19, 16-20

పావనాత్మమా! పెంతెకోస్తు దినాన శిష్యులంతా కలసి

విూది గదిలో భక్తిభావంతో ప్రార్థన చేసికొంటూండగా

నీవు వాయువులాగ, అగ్నిజ్వాలల్లాగ, నాలుకల్లాగ

దిథీలున వారిమిూదికి దిగివచ్చావు

హీబ్రూ భాషలో నీ పేరు "రువా" - అంటే వాయువు

కనుక నీ పేరుకు దగ్గట్టగానే నీవు మహాశక్తితో

గాలిలాగ దిగివచ్చావు

అగ్ని దైవసాన్నిధ్యాన్ని సూచిస్తుంది

కావుననే దైవవ్యక్తివైన నీవు నిప్పలా దర్శనమిచ్చావు

పూర్వవేదంలో మోషే సీనాయి కొండమిూదికెక్కి

కారుమబ్బుల్లో ఉరుముల్లో మెరుపుల్లో నిప్పమంటల్లో

దేవుణ్ణి దర్శించి ధర్మశాస్తాన్ని పొందాడు

దానితో పూర్వవేద సమాజం ప్రారంభమైంది

అలాగే నీవే పెంతెకోస్తు దినాన నూత్న ధర్మశాస్రాన్నొసగి 

నూతవేద సమాజంతో గూడిన శ్రీసభను ప్రారంభించావు

నాలుక వాక్యక్తికి నిదర్శనం

నీవు శిష్యులకు బోధనాసామర్థ్యాన్ని దయచేసావని సూచిస్తూ

వారివిూదికి నాలుకల్లా దిగివచ్చావు

ఇక, ఆ శిష్యులు పెంతకోస్తు దినాన నిన్ను పొందినట్లే

నేడు జ్ఞానస్నానంలో మేమూ నిన్ను స్వీకరిస్తాం