పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/232

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మా కొరకు నీ యేకైక కుమారునే త్యాగం చేసిన నీవు
మమ్మ గాఢంగా ప్రేమించకుండా వుంటావా?
నీ ప్రేమ మా అమ్మానాన్నల ప్రేమంటె బలమైంది,
ప్రాణంకంటె విలువైంది, పర్వతంకంటె స్థిరమైంది
ఆకాశంకంటె ఉన్నతమైంది, సముద్రంకంటె లోతైంది
మేము జ్ఞానస్నానంలోనే పొందిన పవిత్రాత్మ
నిన్ను నమ్మకంతో నాన్నా అని పిల్చేలా చేస్తుంది
మేము నీ బిడ్డలమని నిండుమనస్సుతో విశ్వసించేలా చేస్తుంది
మేము పరలోకపు తండ్రివైన నీకు వారసులమై
నీ యాస్తియైన మోక్షసామ్రాజ్యాన్ని స్వీకరించేలా చేస్తుంది
తండ్రీ! మమ్మ నీ ప్రియసుతుడైన క్రీస్తుచెంతకు ఆకర్షించు
ఆ క్రీస్తూ మమ్మ నీ చెంతకు ఆకర్షించేలా అనుగ్రహించు
బిడ్డలు తమ అవసరాల్లో తండ్రి చెంతకులాగే
మేమూ నీ చెంతకు పరుగెత్తుకొని వచ్చేలా చేయి
విశేషంగా మేము నీప్రేమను అనుభవానికి తెచ్చుకొనేలా చేయి
నిన్ను తలంచుకొని సంతసంతో పొంగిపోయేలాను
నీ దర్శనభాగ్యం కొరకు తపించిపోయేలాను దయచేయి.

21. ఆకాశపక్షులూ గడ్డిమొక్కలూ

మత్త 6, 25-3

ప్రభూ! మాకు చింతలు మెండు
ఏమి తిందామా ఏమి కట్టుకొందామా అని
చీటికిమాటికి ఆందోళనపడుతూంటాం
ఐనా మా ప్రాణం భోజనంకంటె విలువైందనీ
మా దేహం బట్టలకంటె మెరుగైందనీ నీవే బోధించావు

నీవు ఆకాశంవైపు చూపించి
"ఆ విూద యెగిరే పక్షులను చూచారుకదా!
అవి విత్తవు, కోయవు, గింజలు గాదెల్లో చేర్చుకోవు
ఐనా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు