పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/220

ఈ పుట ఆమోదించబడ్డది

 అలా శిక్షిస్తే నే నీపాటికి నరకంలో కూరుకొని వండనా?
భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా వుంటుందో
నీ భక్తులపట్ల నీ ప్రేమ అంత మిక్కుటంగా వుంటుంది
పడమరకు తూర్పు ఎంతదూరమో
మా పాపాలను నీవు అంత దూరంగా తొలగిస్తావు
 తండ్రి తన కుమారులవివాద జాలి చూపినట్లే
నీవూ నీ దాసులమిూద కరుణ జూపుతావు
జాలిగుండెలు కలవాడివి కనుక
నీవు నరులమిూద సులభంగా కోపపడవు
నెనరుగల తండ్రీ! నీవుతప్ప నాకు దిక్కెవరు?
నేను పాపమనే కుష్ట సోకి అపవిత్రుజ్ఞయ్యాను
నీవు నామిూద నీళ్లు చిలకరించి నన్ను శుద్ధిచేయి
కిల్బిషంవల్ల నేను సిందూరంలా ఎర్రనయ్యాను
నీవు నన్ను కడిగితే నేను మల్లా మంచులా తెల్లనౌతాను
నీ కుమారుడైన క్రీస్తుకూడ తాను వచ్చింది
రోగులకోసంగాని ఆరోగ్యవంతులకొరకు కాదన్నాడు
దుషుడనైన నాకు ఇంతకంటె ఊరటవాక్య మేముంటుంది?

12. పాపాన్ని గూర్చిన ఉపమానాలు

ప్రభూ! మేము పాపాన్ని ఏవగించుకోవడానికి
దివ్యగ్రంథం పెక్కు ఉపమానాలను వాడుతుంది
పాపం వ్యభిచారంలాంటిది
భార్యాభర్తలు ఒకరిని కాదని ఒకరు
అన్యవ్యక్తులను సమిూపిస్తారు
అలాగే మేము నిన్ను కాదని
అన్యదైవాల విగ్రహాలను కొలుస్తాం
నేరుగా విగ్రహాలనే కొలవనపుడు కూడ
సృష్టివస్తువులనే విగ్రహాలనుగా జేసికొని వాటిని సేవిస్తాం
పాపం కుష్టరోగంలా అసహ్యమైంది,
కాయలు కాయని అంజూరరలా వ్యర్థమైంది,
తీయని పండ్లకు మారుగా పుల్లని కాయలుకాసే

212