పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/219

ఈ పుట ఆమోదించబడ్డది

ఆ చూపు ఓ బాణంలా అతని యెదలో గ్రుచ్చుకొంది

అతడు తాను కొట్టిన డప్పాలనూ తన పతనాన్నీ తలంచుకొని

వెలుపలికి వెళ్ళి పుట్టెడు దిగులుతో బోరున యేడ్చాడు

పేత్రుకి కలిగిన ఈ తలవంపుల ద్వారా

నేను పాఠం నేర్చుకోవద్దా?

నేను నేననుకొన్నదానికంటె బలహీనుడనని గుర్తించేలా చేయి

నేను కాలుజారి పడినపుడెల్ల ఆ తొందరపాటు శిష్యునిలాగే

వెంటనే చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడేలా చేయి

ఇంకా నేనెన్నిసార్లు నీకు ద్రోహం చేసినా

నీ వెప్పడూ జాలితో నావైపు చూసూనే వుంటావనీ

డెప్టెయేడుసార్లు నన్ను క్షమించడానికి సిద్ధంగానే వుంటావనీ

గ్రహించే భాగ్యాన్ని కూడ ఈ పాపికి అనుగ్రహించు.


11. కరుణామయుడు

కీర్త 51,4,7, యెహెజ్కేలు 33, 11. కీర్త 103, 10-13, లూకా 5,31.


ప్రభూ! నా జీవితమార్గంలో ఓమారు

వెనక్కు తిరిగి చూస్తే నాకు కన్పించేవన్నీ ఫరోరపాపాలే

పొట్టలో పురుగులుండే రేగుపండుని నేను

నేను పుట్టినప్పటినుండి పాపాత్ముడనే

మా యమ్మ నన్ను కన్నప్పటినుండి కిల్బిషాత్ముడనే

నేను చేయవలసిన పనులు చేయనేలేదు

చేయగూడని కార్యాలు మాత్రం ఎగిరెగిరి చేసాను

నా తప్పిదాలను స్మరించుకొంటే

నా మొగాన నెత్తురుచుక్క మిగలదు

నేనింత అల్పడ్డి, యింత తక్కువవాణ్ణి

కాని నా పాపాల కుప్పమాత్రం ఓ కొండలా పెరిగింది

ఐనా నీవు పాపి నాశంగావాలని కోరుకోవు

అతడు మనసు మార్చుకొని మల్లా బ్రతకాలనే నీ తలపు

కనుకనే నీవు నా పాపాలకు తగినట్లుగా నన్ను శిక్షింపవు