పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/201

ఈ పుట ఆమోదించబడ్డది

4. విధేయత

26. నేను దైవ చిత్తానికి లోబడుతుంటానా? పెద్దల ఆజ్ఞల్లో దేవుని చిత్తాన్ని గుర్తిస్తుంటానా?
27. పరిశుద్దాత్మ నాలో కలిగించే ప్రబోధాలను గుర్తించి వాటికి అనుగుణంగా నడచుకొంటుంటూనా?
28. మఠనియమాలనూ పెద్దల ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తుంటానా?
29. తప్పనిసరై బయటికి మాత్రమే విధేయించకుండా మనసులోగూడ విధేయతా భావాలు కలిగివుంటానా?
30. పెద్దలను గౌరవంతో చూస్తుంటానా? అవసరమైనప్పడెల్లా నా హృదయాన్నివాళ్ళకి విప్పి చూపిస్తుంటానా?

5. దారిద్ర్యం

31. నేను క్రీస్తులాగే ఇహలోక వస్తువ్యామోహాన్ని జయించి దేవునిమీద ఆధారపడి జీవిస్తుంటానా? (మత్త 8,20)
32. మరజీవితంలో నాకు లభించే వస్తువులతో సంతృప్తి చెందుతుంటానా
33. నేను ఏవైనా ప్రత్యేక వస్తువులు వాడుకోవలసి వచ్చినపుడు ముందుగా పెద్దలనుండి అనుమతి పొందుతుంటానా? 34. మఠసంపదను నా బంధుమిత్రుల హస్తగతం చేయకుండా వుంటుంటానా?
35. పేదల్లో క్రీస్తునిచూచి వారిపట్ల జాలీ సానుభూతీ ప్రదర్శిస్తుంటానా?
36. సమాజంలోని సాంఘిక అన్యాయాలను అవగాహనం చేసికొని నా చేతనైనంత వరకు పేదలకు న్యాయం జరిగిస్తుంటానా?

6. బ్రహ్మచర్యం

37. బ్రహ్మచర్యం ద్వారా దేవుణ్ణి తోడినరుజ్జీగూడ అధికంగా ప్రేమిస్తామని గుర్తిస్తుంటానా?
38. లింగమనేది దేవుడిచ్చే వరమనీ, మఠజీవితంలో దాన్ని మల్లా దేవునికే అర్పిస్తామనీ అర్థంచేసికొంటుంటానా?
39. కేవలం శారీరకంగా మాత్రమే కాకుండ మానసికంగా గూడ బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటానా?