పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/191

ఈ పుట ఆమోదించబడ్డది

19.తీసికోవడంకంటె ఈయడం ధన్యం - ఆచ 20,35, నేనెప్పడూ ఇతరులు నాకేమిస్తారా అనే చూస్తుంటానుగాని, ఇతరులకు నేనేమి ఈయగలనా అని ఆలోచిస్తానా?

20.నరుడికి నరుడు తోడేలు. సోదరప్రేమ మనంతట మనకు అలవడదు. అది దేవుడే యిచ్చే వరం - రోమా 5,5, నేను ఆవరం కోసం వినయంతో ప్రార్ధిస్తుంటానా?

ప్రార్ధనం

ఓ ప్రభూ! క్రైస్తవ జీవితంలోకల్ల అతిముఖ్యమైందీ, అతికష్టమైందీగూడ సోదరప్రేమే. మేము ఏవేవేవో పుణ్యాలను సాధించబోతాం కొని ఈ ముఖ్యమైన పుణ్యాన్ని మాత్రం విస్మరిస్తాం. మా యవివేకాన్ని మన్నించు. నీయాత్మ సహాయంతో మేమీ పుణ్యాన్ని సాధించే భాగ్యం దయచేయి - ఆమెన్.

8. ముగ్గురు సేవకుల సామెత

మత్త 25-14-30

1.యజమానుడు ఆ ముగ్గురు సేవకులకు డబ్బిచ్చినట్లుగానే, ప్రభువు నాకు దయచేసిన శక్తిసామర్థ్యాలను నేను కృతజ్ఞతా భావంతో గుర్తిస్తుంటానా?

2.నా మేలిగుణాలేమిటివో, నా లోపాలేమిటివో నాకు బాగా తెలుసా?

3.నేను నా శక్తిసామర్థ్యాలను దేవునికీర్తికొరకూ, తోడి ప్రజల ఉపయోగం కొరకూ వినియోగిస్తుంటానా?

4. ఇతరులకు సేవచేయడానికిగాను నేను నేర్చుకోగల్గినన్ని సంగతులు నేర్చుకొని, ఆర్థించగలిగినన్ని నైపుణ్యాలు ఆర్థిస్తుంటానా?

5. నా పాలబడిన బాధ్యతలనూ పనులనూ ఓపికతోను ధైర్యంతోను అంగీక రిస్తుంటానా?

6.అవసరమైనపుడు నాయకత్వాన్ని వహించడానికి సిద్ధంగా వుంటానా?

7.నాకు ఆత్మవిశ్వాసమూ కార్యారంభశక్తి వున్నాయా?

8.నాశక్తి సామర్థ్యాలనూ, కాలాన్నీ జీవితాన్నీ ఇతరుల సేవకొరకు వినియోగించడానికి సిద్ధంగా వుంటానా?


9.నా అధికారం, పలుకుబడి, తెలివితేటలు మొదలైనవాటిని నా స్వార్ధలాభానికిగాక ఇతరుల సేవకొరకు వినియోగించడానికి సంసిద్ధంగా వుంటానా?