పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/187

ఈ పుట ఆమోదించబడ్డది

16.అగస్టీను భక్తుడు "ఓ ప్రభూ! మా హృదయాన్ని నీ కొరకే చేసావు. నీయందు విశ్రమించిందాకా దానికి విశ్రాంతి లేదు" అన్నాడు. నా హృదయంలో నిజమైన శాంతీ సంతృప్తి పున్నాయా? లేకపోతే కారణమేమై వుంటుంది? 17. "భాండశుద్ధిలేని పాకమేల?" అన్నాడు వేమన్న నేను అపవిత్రమైన హృదయంతో దేవుణ్ణి పూజిస్తే ఆ పూజ అతనికి ప్రియపడుతుందా? 18.ఇంకా అతడే "తలలు బోడులైన తలపలు బోడులా?" అన్నాడు. నా హృదయంలోని కోరికలు ఏలా వుంటాయి? 19.మేడిపండు చూడ్డానికి మేలిమిగా వున్నా పొట్టవిప్పి చూస్తే పురుగులుంటాయి. గురువిందగింజ ఎర్రగా నిగనిగలాడుతున్నా దాని పొట్టక్రింద నల్లని మచ్చ వుంటుంది. నా జీవితంకూడా ఈలాగే వుండడం లేదు కదా? 20.ఎవరు త్రవ్వకొన్న గోతిలే వాళ్లే పడతారు అనే సామెత నా జీవితంలో ఎన్నోసార్లు నెరవేరడం లేదా? 21.తోడి నరులే గనక నా హృదయంలోని ఆలోచనలనూ కోరికలనూ తెలుసుకోగలిగితే ఇక నా మొుగాన నెత్తురుచుక్క వుంటుందా? 22. పరోపదేశ పాండిత్యం చాలమందికి వుంటుంది. కాని స్వయంగా ఆచరించేవాడే డొక్కశుద్ధికల నరుడు. ఈ సూత్రంతో కొల్చిచూస్తే నేను నిలుస్తానా?

ప్రార్ధనం

ఓ ప్రభూ! నీవు సత్యప్రియుడవైన దేవుడివి. అసత్యం నీకు ఎంతమాత్రమూ గిట్టదు. మేమైతే నిత్యజీవితంలో వంచనతోను కపటంతో నాటకాలు ఆడబోతాం. కాని మా యెత్తులు నీ యెదుట చెల్లవు. నీవు హృదయాలను పరిశీలించే వాడివని గుర్తించి చిత్తశుద్ధితో జీవించే భాగ్యం దయచేయి — ఆమెన్

6. కుటుంబ ధర్మాలు

1.ఆదాము ఏవను చూచి ఈమె నాయెముకల్లో యెముక, దేహంలో దేహం అనుకొన్నాడు - అది 2, 23-24 భార్యాభర్తలమైన మేము ఏక శరీరానిమి, ఏకవ్యక్తిమి అన్నంత సన్నిహితంగా జీవిస్తుంటామా? 2.భగవంతునికి తన భక్తులమీదవుండే ప్రేమకి ప్రతిరూపం భార్యాభర్తలప్రేమ. వివాహసమయంలో శ్రీసభా క్రీస్తూ అనే పోలిక భార్యాభర్తలమీద సోకుతుంది -