పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/176

ఈ పుట ఆమోదించబడ్డది

6. ప్రభూ! నీవు "నిర్మలహృదయులు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి దర్శిస్తారు" అని పల్మావు. కాని మేము మా యింద్రియాలు తెచ్చిపెట్టే దుష్టవాంఛలకు లొంగిపోతాం. మా హృదయం దురాశలతో నిండివుంటుంది. మాకు చిత్తశుద్ధిలేదు. నీ వైపు కన్నులెత్తి చూచే సాహసంకూడ మాకు లేదు నీవు లోకంయొక్క పాపాలను పరిహరించే సర్వేశ్వరుని గొర్రెపిల్లవి.

7. ప్రభూ! నీవు "శాంతిస్థాపకులు ధన్యులు, వాళ్ళ దేవుని కుమారులు అనబడతారు" అని బోధించావు. కాని మేము మా కుటుంబాల్లోను సమాజాల్లోను దేశంలోను అశాంతిని నెలకొల్పుతాం. కలహాలు పెంచుతాం. నీవు లోకం యొక్క పాపాలను పరిహరించే సర్వేశ్వరుని గొర్రెపిల్లవి.

8. ప్రభూ! నీవు "ధర్మంకొరకు హింసలనుభవించేవాళ్లు ధన్యులు, దైవరాజ్యం వాళ్ళది" అని చెప్పావు. కాని మేము ఏనాడు ధర్మం కొరకు బాధలు అనుభవించం. ఇంకా అధర్మానికి పాల్పడతాం. ఇతరులను పీడిస్తాయి. దోచుకొంటాం, హింసిస్తాయి. మా ప్రపంచం క్రూరకార్యాలతోను హింసలతోను నిండివుంది. నీవు లోకం పాపాలను పరిహరించే సర్వేశ్వరుని గొర్రెపిల్లవి.

ప్రార్ధనం

ప్రభూ! నీవు సాధుమూర్తివి. వినుమ హృదయుడివి. కరుణామయుడివి. శాంతిస్థాపకుడివి. దీనాత్మడివి. ధర్మం కొరకు హింసలు అనుభవించినవాడివి. నీవు సిలువమరణంద్వారా మహిమను పొందావు. మేము కూడ అదేమార్గంలో నడచిపోవాలని తెలియజేసావు. మేము సువిశేషంలోని నీ ధన్యవచనాల సందేశాన్ని భక్తిభావంతో పాటించేలా చేయి. నీవు చూపిన ఆదర్శం ప్రకారం జీవించి మోక్ష బహుమానాన్ని సంపాదించుకొనే భాగ్యాన్ని ప్రసాదించు – ఆమెన్.

2. పర్వత ప్రసంగం

మత్త 5-7 .

1. ప్రభూ! నీవు "దీనాత్మలు ధన్యులు" అని పల్మావు- 5,3. మేము ఈ లోకవస్తువులకు అంటిపెట్టుకొంటాం. వాటినే నమ్ముతాం. గర్వంతో పొంగిపోతాం.

జవాబు - (ఒక్కొక్క చరణం తార్వత) మేము ఇతరులను క్షమించినట్లే నీవూ మమ్మ క్షమించు.