పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/173

ఈ పుట ఆమోదించబడ్డది

అర్పిస్తుంది. ఆ జపం మన రక్షణకు ఉపయోగపడుతుంది. తల్లి చిన్న బిడ్డకు సహాయం చేసి నడక నేర్పతుంది. ఈలాగే ఆత్మ మనలను ప్రార్థనలో నడిపిస్తుంది. శతాబ్దాల పొడుగున పనీతులకు, భక్తిమంతులకు ప్రార్ధన నేర్పింది ఆత్మ నేడు మనకు కూడ జపం చేసే విధానాన్ని నేర్చేది ఆత్మ కనుక మనం ఆ యాత్మ సహాయాన్ని అడుగుకోవాలి. ఆ యాత్మ మన హృదయంలోనే వుండి మనలను ప్రార్థనకు పరికొల్పుతుంది.

42. ప్రతిపని యేసు పేరిట - కొలో 3,17

మనం ప్రార్థన చేసేది కొద్దికాలమే. అధిక కాలం పనులు చేస్తుంటాం. కనుక ఈ పనులను కూడ ప్రార్థనగా మార్చుకోవాలి. ఏలా? వాటిని క్రీస్తుకి అర్పించడం ద్వారా వాటిని క్రీస్తుపేరిట చేయడంద్వారా, మొదట, మన పనిని చిత్తశుద్ధితో చేయాలి. మోసం పనికిరాదు. అరకొరలుగా పని చేయకూడదు. రెండవది, ఆ పనిని మన మహిమకొరకు గాక దేవుని మహిమకొరకు చేయాలి. దాన్ని పరిపూర్ణంగా దేవునికి అర్పించాలి. ఈలా పవిత్రమైన ఉద్దేశంతో చేసిన పని ప్రార్థనగా మారిపోతుంది. తనపనే ప్రార్ధనగా జీవించే నరుడు పునీతుడు ఔతాడు. మన పనులను ప్రార్థనగా మార్చుకోవడానికి ఉదయకాల సమర్పణం బాగా ఉపయోగపడుతుంది.

43. నీతిమంతుని ప్రార్థన మహాశక్తి కలది - యాకో 5,16

ప్రార్థన విద్యుచ్ఛక్తి అణుశక్తి లాంటిది, దానితో ఏ కార్యాన్నయినా సాధించవచ్చు. అది నిచ్చెనలాంటిది, దానితో దేవుని దగ్గరకు ఎక్కిపోతాం. అది మోక్షంలోని ఏ గదినైనా తెరవగల బంగారు తాళపుచెవి. దేహానికి అన్నం ఏలాగో ఆత్మకు ప్రార్ధనం ఆలాగు, జపంవల్ల మన హృదయంలో శాంతిసమాధానాలు నెలకొంటాయి. నరుడు దేవునితో ఐక్యమౌతాడు. లోకంలో ఎంతోమంది ఎన్నోకార్యాలు సాధించి పేరు తెచ్చుకొన్నారు. కాని ప్రధానకార్యం, అతడు పొందవలసిన ప్రధాన విజయం, ప్రార్థనే జపం చేసుకొనే నరుడు దివ్యడు.