పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/156

ఈ పుట ఆమోదించబడ్డది

7. నన్ను నేను విస్మరించుకొనేలా చేయి


ప్రభూ! నన్ను నేను కాస్త విస్మరించుకొనేలా చేయి
నరుడు నీ హృదయంలోనికి ప్రవేశించే మార్గం ఇదొక్కటే
 నన్ను నేను విస్మరించుకొని
నిన్ను స్మరించుకోవాలనే కోరికను
 నీవే నా యెదలో పట్టించావు
 ఈ కార్యాన్ని సాధించే భాగ్యాన్ని గూడ నీవే దయచేయి
 నీ సహాయం లేందే నేనీ యాశయాన్ని నెరవేర్చుకోలేను
 నన్నునేను విస్మరించుకోవాలంటే నాకే కష్టంగా వుంటుంది
 కాని ఈ కార్యాన్ని సాధించాలనే కోరిక మాత్రం నాలో వుంది
 కనుక నీవే నాకు ఈ పని చేసిపెట్టు
 ప్రభూ! నేను మోక్షాన్ని చేరుకొంటే
 అది నీ కృప ఫలితమే ఔతుంది
అది నీకేకీర్తి తెచ్చిపెడుతుంది
 అందుకే నేను నీ సన్నిధిని చేరుకోవాలని
 ఏ ప్రాదూ ఉవ్విళ్ళూరుతూంటాను. - క్లోడ్ డెలా కొలంబియేర్, 17వ శతాబ్దం

8. హృదయార్పణం


• మర్గరీత మరియనైన నేను, నన్ను నేను
 పూర్తిగా క్రీస్తు శ్రీ హృదయానికి సమర్పించుకొంటున్నాను
 నా జీవితాన్నీ పనులనూ సుఖదుఃఖాలనూ
 ఆ ప్రభువు చేతుల్లో పెడుతున్నాను
 అతని సేవలోనే జీవించి
 అతని కీర్తికొరకే రోజులు సాగించాలని నా కోరిక
 నేను పూర్తిగా క్రీస్తుకే చెంది వుండాలనీ
 నేను చేసే పనులన్నీ ఆ ప్రభువు ప్రేమకొరకే చేయాలనీ
 నా తిరుగులేని నిర్ణయం
 రక్షకునికి నచ్చని కార్యాలన్నిటినీ
పరిత్యజించాలనిగూడ నా యభిమతం
148