పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/155

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మమా! జాగుచేయక సిలువపై మరణించిన
 ఆ క్రీస్తు పార్శ్వంలోనికి ప్రవేశించు
 ప్రేమవలన తెరువబడిన ప్రభువు పార్శ్వంలోని
గాయంగుండా అతని హృదిలోనికి అడుగిడు

-టోమస్ అకెంపిస్, 15వ శతాబ్దం

5. మరణకాలంలో ఆశ్రయం

ప్రభూ! మీ యమ్మ కన్నులార జూస్తుండగానే
 సైనికుడు క్రూర శూలంతో నీ హృదయాన్నిభేదించాడు
 నీ వనుభవించిన ఘటోరయాతనలకూ
 నీవు చూపిన గాఢప్రేమకూ నా నమస్సులు
 మంచితనానికి పెట్టిందిపేరు నీ హృదయం
 సా హృదయాన్ని సంపూర్ణంగాను, సకల కాలంవరకూను,
 దాని సమస్తాభిలాషలతోపాటూను,
 నీ హృదయానికి కానుక బెడుతూన్నాను
 నా జీవితకాలమంతాను, విశేషంగా నా మరణకాలంలో
 నీ హృదయంలోని పవిత్రమైన గాయం
 నా కాశ్రయమైతే అదే మహాభాగ్యం.

-నికోలాస్ ఎస్కియస్, 16వ శతాబ్దం

6. ఆత్మార్పణం

ప్రేమమూర్తివైన ప్రభూ!
 నా దేహాత్మలనూ సకలేంద్రియాలను నీకే అర్పిస్తున్నాను
 నేను నీ హృదయక్షతాన్ని నమ్ముకొంటున్నాను
నన్ను ఆ పవిత్రమైన గాయంలో దాచివుంచుకో
పాపంనుండీ దురాశలనుండీ నన్ను కాపాడు
 నా హృదయాన్ని దాని యిష్ణానిష్ణాలతోపాటు,
 అది చేసే పనులతోపాటు, అది తీసికొనే విశ్రాంతితోపాటు
 హృదయంలో దాచి వుంచు
 ప్రభూ! నా మనోవాక్కాయకర్మలన్నిటికీ
 ఆరంభమూ అంతమూ నీవే ఔదువుగాక!

- ఓ అజ్ఞాత రచయిత, 17వ శతాబ్దం