పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/153

ఈ పుట ఆమోదించబడ్డది

2. ప్రభువు హృదయాన్ని కనుగొన్నాను

ప్రభూ! నీ హృదయం గొప్ప నిధి
పవిత్రమైన నీ దేహక్షేత్రంలో
దొరికే వెలలేని ముత్యం నీ హృదయం
ఈ ముత్యాన్ని ఆశింపనివాడెవడు?
నేను నా రత్నాలన్నిటినీ వెచ్చించి
నా భావాలనూ ప్రేమలనూ అమ్మివేసి
ఈ యమూల్య మణిని కొంటాను
ప్రభూ! నేను నా బాధలన్నిటినీ
నీ హృదయంముందు పెడుతున్నాను
నీవు నన్ను తప్పక కరుణిస్తావు
నా సోదరుడవు, స్నేహితుడవు, రాజువనైన
నీ హృదయాన్ని నేను కనుగొన్నాను
నీ హృదయమే నా హృదయంకూడ
కనుకనే నేను నీ హృదయానికి మనవిచేస్తున్నాను
నా యీ వేడికోలును నీ వాలించే ప్రార్థనల్లో చేర్చు
నన్ను నీయెడదలోనికి ప్రవేశింపనీయి
మాకు నీ హృదయంలోనికి మార్గం లభించడానికే
ఆనాడు నీ ప్రక్కని యిూటెతో పొడిచి తెరిచారు
నేను ఈ ప్రపంచ వ్యామోహాలనుండి వైదొలగి
ని హృదయంలో వసించడానికే ఆనాడు
నీ గుండెను పొడిచి గాయపరిచారు కంటికి కన్పించే
నీ యెడదలోని గాయంద్వారా కంటికి కన్పించని
నీ ప్రేమగాయాన్ని మేము దర్శించడానికే
ఆనాడు నీ హృదయాన్ని గాయపర్చారు
నీ దేహాన్ని మాత్రమేకాక హృదయాన్నికూడ
ఈలా యూటెతో గాయపర్చారు అంటే
నీ ప్రేమ యెంత గాఢమైందో తెలిసిపోతుంది
నీ హృదయంలోని ఈ గాయం
నీ మనసులోని ప్రేమకు సాక్ష్యంగా వుంటుందికదా!
- భక్తుడు బోనవెంచరు, 13వ శతాబ్దం