పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/136

ఈ పుట ఆమోదించబడ్డది

ఆ ప్రభువు మనలను విమోచించాడు. రక్షణకార్యం సమస్తమూ సమాప్తమైంది. ఈ రక్షణాన్ని గూర్చి తర్వాత నూతవేద రచయితలు "క్షుద్రమైన వెండి బంగారాల వలన మీకు పాప విమోచనం కలుగలేదు, నిష్కళంకమైన గొర్రెపిల్ల అనబడే క్రీస్తు అమ్యూలమైన రక్తం వలన మీకు విమోచనం కలిగింది" అన్నారు - 1 పేత్రు 1,18-19.

ఔను, క్రీస్తు తండ్రి చిత్తాన్నీ పూర్వవేద ప్రవచనాలనూ నెరవేర్చి సిలువమీద చనిపోయాడు. ఆలా చనిపోయి మన పాపాలకు విమోచనం చేసాడు. అతనిలాగే మనంకూడ నేడు తండ్రి చిత్తానికి ಬಡ್ದಿಲವು జీవిస్తే అతని రక్షణాన్ని సంపూర్ణంగా పొందుతాం. నరుని శ్రేయస్పూ సౌభాగ్యమూ విజయమూ అంతాకూడ తండ్రి చిత్తానికి లొంగివుండడంలోనే వుంది. తండ్రి ఆజ్ఞకు లోపడి జీవించాలంటే ఒకోసారి చాల కష్టంగా వుంటుంది. మనకు ససేమిరా గిట్టదు. కాని ఆలాంటి సందర్భాల్లో కూడ మనం ඡෆශී! నా చిత్తప్రకారం గాదు, నీ చిత్తప్రకారమే జరగనీయి అని చెప్పగలిగివుండాలి. అప్పుడే మనం క్రీస్తుకి సన్నిహితులమయ్యేది.

ఏడవ వాక్యం

"యేసు తండ్రీ నా యాత్మను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను అని పల్కి ప్రాణం విడిచాడు" - లూకా 23, 46.

ఆదాము చేసిన తొలిపాపం ఫలితం చావు. ఈ యాదాము తన పెద్దకొడుకు కయీను చిన్నకొడుకు హేబెలును చంపగా చూచాడు. అదే లోకంలో తొలి మరణం. ఇవ్పడు మళ్ళా కయీను సంతతివారిని చెప్పదగిన యూదులు హేబెలులాగ నీతిమంతుడయిన క్రీస్తుని వధిస్తున్నారు.

ఆరవ వాక్యాన్ని ప్రభువు క్రిందికిజూస్తూ ఉచ్చరించాడు. కాని ఈ యేడవ వాక్యాన్ని పైకిజూస్తూ ఉచ్చరించాడు. అనగా అతడు ఈ భూమిమీద నుండి తండ్రి చెంతకు వెళ్ళగోరాడు. కాలాన్ని దాటి అనంతంలో అడుగిడ గోరాడు.

దుడుకు చిన్నవాడు దూరదేశాన్నుండి తండ్రి యింటికి తిరిగివచ్చాడు. యూదులు ఐగుప్త ప్రవాసంనుండీ, తర్వాత బాబిలోను ప్రవాసంనుండీ వాగ్దత్తభూమికి తిరిగి వచ్చారు. అలాగే క్రీస్తకూడ ముప్ప్తెమూడేండ్లు ఈ లోక ప్రవాసంలో గడిపి తండ్రి యింటికి తిరిగి వెళ్తున్నాడు. ఆలా వెళ్తూ అతడు పల్కిన మాటలు "తండ్రీ! నీ చేతుల్లోకి నా యాత్మను సమర్పిస్తున్నాను" అని. ఈ వాక్యాన్నిగూడ అతడు ఓ ప్రార్థనగా జపించాడు. ఇది 31వ కీర్తనలోని 5వ వాక్యం.