పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

9. వాళ్ళకు ద్రాక్షరసం - యోహా 2,3.

ఇంతవరకు మనవి ప్రార్థననుగూర్చి విచారించాం. ఈ మనవి ప్రార్ధనం చాల ముఖ్యమైంది. రోజురోజు ప్రభువును మనవిచేస్తూ వుండాలి. చాలామంది దృష్టిలో ప్రార్ధనం అంటే విశేషంగా యీ మనవి ప్రార్ధనమే. కాని యీ మనవి ప్రార్ధనం వొక్కటే ప్రార్ధనం అనుకోవడం పెద్ద పొరపాటు, మనవి ప్రార్ధనం మాత్రమేగాక యింకా వేరేరకాల ప్రార్థనలు చాలా వున్నాయి. రోజూ దేవుణ్ణి అవి గావాలి యివిగావాలి అని అడుగుకుంటూ మనవి ప్రార్ధనం మాత్రమే చేసికునేవాళ్లల్లో స్వార్ధం బలపడిపోతుంది. కనుక ఇకరాబోయే అంశాల్లో విజ్ఞాపన ప్రార్థనను గూర్చి విచారిద్దాం. మనకోసం మనం చేసుకునే ప్రార్థనను మనవి జపం అంటాం. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనను విజ్ఞాపన జపం అంటాం. ఈ భేదాన్ని బాగా గమనిస్తూ వుండాలి.

2. విజ్ఞాపన ప్రార్లనం

9A. ఆ పట్టణాల్లో పదిమంది నీతిమంతులుంటే - ఆది 18, 22-32.

సోదొమ గొమఱ్ఱా ప్రజల దుష్టకార్యాలు మితిమీరిపోయాయి. ప్రభువు ఆ పట్టణాలను దండించడానికి దిగివచ్చాడు. కాని అబ్రాహాము ప్రభువు నెదుట నిలచి ఈ దుష్ట నగరాల తరఫున విజ్ఞాపనం చేసాడు. అక్కడ 50 మంది నీతిమంతులుంటే వారిని రక్షించమన్నాడు. ప్రభువు సరేనన్నాడు. కాని అంతమంది నీతిమంతులు అక్కడలేరు. చివరకు 45, 40, 30, 20, 10 వరకు సంఖ్య దిగిజారిపోయింది. కాని ఆ నగరాల్లో పదిమంది నీతిమంతులు కూడ దొరకలేదు. అంచేత ప్రభువు గంధకం గురిపించి ఆ పరాలను నేలమట్టం చేసాడు. కాని యిక్కడ అబ్రాహాము చేసిన విజ్ఞాపనం చాల వుదాత్తమైన ప్రార్ధనం. అతడు ఆ పాపపు ప్రజల కోసం ఆరు సార్లు ప్రభువును వేడాడు, "దుమ్ము బూడిదయునైన నేను సాహసించి ప్రభువుతో మాటలాడుతున్నాను - దుషులతో పాటు నీతిమంతులను కూడ నాశం చేస్తావా ప్రభూ!” అని సవినయంగా విన్నవించుకున్నాడు. ఈలాగే మనంకూడ ఇతరులకోసం భక్తిశ్రద్ధలతోను పట్టుదలతోను ప్రార్ధనం చేస్తూండాలి.

10. నలువదినాళ్లు యావే సన్నిధిలో చాగిలపడితిని - ద్వితీ 9, 25-29.

మోషే పదియాజ్ఞలకని సీనాయి కొండమీదికెక్కి పోయాడు. అక్కడ ప్రభుసాక్షాత్కారం కోసం నలుబది నాళ్లు ప్రార్థనల్లో గడుపుతూ వచ్చాడు. ఈ మధ్యలో అహరోనునాయకత్వం క్రింద యిప్రాయేలు ప్రజలు బంగారు దూడను తయారు చేసికొన్నారు.