పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/127

ఈ పుట ఆమోదించబడ్డది

కన్నపుడు మాత్రం ఘౌరశ్రమలు అనుభవించింది. ఆమెను వ్యాకులమాత, వేదసాక్షుల రాజ్ఞ అని పిలుసాయి. ఆమె శ్రమలు క్రీస్తు శ్రమలవలన కలిగినవి మాత్రమేకాదు. తాను మనకు ఆధ్యాత్మికంగా తల్లికావడం వలన కలిగినవికూడ.

స్త్రీ ప్రసవవేదనతో బిడ్డలను కనాలనే పూర్వశాపం వుంది - ఆది 3, 16. మరియు పాపరహిత కనుక క్రీస్తుని కన్నపుడు ఈ శాపం ఆమెకు సోకలేదు. కాని మనలను కన్నపుడు మాత్రం ఆమె వేదన అనుభవించింది. ఈ వేదన శారీరకమైంది కాదు, హృదయగతమైంది అని ముందే చెప్పాం. ఓ ఖడ్డం ఆమె హృదయంలోకి గుచ్చుకొని పోతుందనే సిమియోను ప్రవచనంగూడ వుంది - లూకా 2, 35.

బేత్లెహెమునుండి కానావూరిదాకా మరియు కేవలం క్రీస్తు జననిగానే కన్పిస్తుంది, కానాపూరినుండి కల్వరి వరకు ఆమె క్రీస్తు శిష్యులకు జననిగాకూడ కన్పిస్తుంది. కల్వరిఘట్టంనుండి ఆమె పూర్ణంగా శిష్యులకు తల్లి ఔతుంది. ఓ మారు మరియా ఆమె బంధువుల బిడ్డలూ క్రీస్తుని చూడ్డానికిరాగా మీయమ్మా మీ సోదరులు నిన్ను చూడ్డానికి వచ్చారని ఎవరో క్రీస్తుతో చెప్పారు. అప్పుడు ప్రభువు నా తల్లి ఎవరు? నా సోదరులెవరు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళే నాకు తల్లిలాంటివాళ్ళూ నా సోదరుల్లాంటివాళ్ను ఔతారని అన్నాడు - మత్త 12, 46-50. ఈ వాక్యాలనుబట్టి బహిరంగ జీవిత ప్రారంభంనుండి క్రీస్తకూడ తన తల్లి తనకొక్కడికే ప్రత్యేకంగా తల్లి కాదనీ, ఆమె మనకుకూడ తల్లి ఔతుందని భావించాడనీ ఊహించుకోవాలి. సరే, అతడు కల్వరిమీద చనిపోతూ మనలను మరియకు సంపూర్ణంగా బిడ్డలను చేసిపోయాడు. అంతకుముందు ఒక్కడే కొడుకైనా ఆ తల్లికి ఈ సమయంనుండి లోకమంతా సంతానమైంది. విశేషంగా పెంతెకోస్తు సమయంనుండి ఆమె లోకమాత ఐంది.

మరియు క్రీస్తుకి తల్లిగావడం చాల గొప్ప భాగ్యం. కాని ఆమె క్రీస్తు శిష్యులకు తల్లిగావడంగూడ సామాన్యమైన భాగ్యంకాదు. క్రైస్తవులంటే యెవరు? క్రీస్తుచే రక్షింపబడిన వాళ్లు, క్రీస్తుని ధరించేవాళ్లు, ఇప్పడు నేను గాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్పకోవడానికి అరులైన వాళ్లు - గల 2,20, ఈలాంటి క్రైస్తవులకు మరియ తల్లి ఔతెంది.

ఇక, మన తరపున మనకు మాత్రం మరియను తల్లిగా పొందడం సామాన్య భాగ్యమా? క్రీస్తు తల్లి మనకు గూడ తల్లి కావడం అనే భాగ్యానికి మనంతట మనం నోచుకోగలమా? క్రీస్తు చనిపోతూ ప్రేమతో తన తల్లిని మనకు తల్లినిచేసిపోయాడు. ఆమెను మనం ప్రభువు తర్వాత ప్రభువంతటిదాన్నిగా స్వీకరించి గౌరవించాలి.అన్సెల్ము