పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

కునికిపాట్లుపడి ఆరిపోయే నా వెలుగు నాకును ఇతరులకునుగూడ మంచి ఫలితాలన్నీయాలని ఆశిస్తున్నాను.

పదునాల్గవ స్థలం

క్రీస్తుని భూస్థాపనం చేయడం

క్రీస్తు దేహాన్ని నారవస్తాలతో జుట్టి అరిమత్తయియా యోసేపని సమాధిలో వుంచారు. క్రీస్తు బంధువులు శిష్యులు ఆ సమాధి ద్వారంపై పెద్ద రాతిపలకను బోర్లించి విచారంతో వెళ్ళిపోయారు.

ఇప్పడు అంతా నిశ్శబ్దం. ఆ భయంకరమైన తుఫాను ఆగిపోయింది. పెద్ద నెమ్మదికూడ కన్పిస్తూంది. అది పూర్వవేద ప్రవచనాల నెరవేరుదలయొక్క చిహ్నం. ఆ సమాధిలో పవ్వళించియున్న అమృతమూర్తి పిత విధించిన బాధ్యతను బహుజాగ్రత్తతో నిర్వహించి ముగించాడు. ఆ బాధాతత్వబోద్ధ తన బడలికనుండి యిపుడు విశ్రాంతి తీసికొంటున్నాడు.

పాస్క ఆదివారపు మహిమకూడ ఆ సమాధిచుట్టు అప్పడే తొలకరి మెరుపులాగ మెరుస్తూంది.

కాని శిష్యులు ఈ యంశాన్ని గ్రహించలేదు. క్రీస్తు మరణంతో సమస్తం గతించిపోయిందనే వారి భావం. ఆశలన్నీ అడుగంటాయనే వారి విచారం.

ఆ నిరాశా హృదయులకు క్రీస్తు శీఘంగానే దర్శనమిచ్చాడు. తన నూత్న శక్తినీ జీవనజ్యోతినీ వారిపై ప్రసరింపజేసాడు. మెస్సీయా బాధలనుభవించిన పిదపగాని మహిమలో అడుగుపెట్టడని అప్పడు వారికి అర్థమైంది. మన కొరకు క్రీస్తు ప్రాణాలు అర్పించాడని అప్పడు వాళ్ళకు అవగతమైంది.

ప్రార్ధనం

ఉత్థానపాదుడవైన ప్రభూ! పెద్ద శుక్రవారం తర్వాత పాస్క ఆదివారంగూడ వస్తుంది అన్న సత్యాన్ని నీ ఉత్తానం బోధిస్తూంది. ఊటబుగ్గనుండి జలధారలాగ బాధలనుండీ మరణంనుండీ ఆనందమూ జీవమూ జాలువారుతాయని నీ యద్భుత చరిత్ర చాటిచెపుతుoది. నేను ఈ సత్యాన్ని చక్కగా జీర్ణించుకొందునుగాక. క్రీనీడలు నాపై హిలేపడు ఈ సత్యపు వెలుగు నాకు దారిచూపునుగాక. బాధలను ఎదుర్కొనే ప్రతి నరుడూ గాలి తాకుళ్ళను ఎదుర్కొనే వృక్షంలాగ బలపడతాడు. ధీరతతో అంధకారంలో పయనించే