పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభూ! నా బాధలు నీ బాధలతో కలసి ఇతరులకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని నేను బాగా అర్థం జేసికొంటే, నాకు కలిగే బాధలు నన్నంతగా క్రుంగదీయలేవు.

ఎన్మిదవ స్థలం

క్రీస్తు యెరూషలేము స్త్రీలను ఓదార్చడం

క్రీస్తునిసిలువ వేయడానికి తీసికొని పోతున్నారు. ఒక తావులో యెరూషలేములోని స్త్రీలు అతని ఫరోరబాధలను జూచి గుండెలు కరగి బోరున యేడ్చారు. అతన్ని ఓదార్చబోయారు. కాని వాళ్ళ యేసుని ఓదార్చడంకంటె అధికంగా ಹೊಸಿ వాళ్ళను ఓదార్చాడు. ప్రభువు ఎప్పుడు కూడ స్త్రీలపట్ల దయా ఆదరభావమూ చూపేవాడు. అతడు నాయీను విధవను ఓదార్చి ఆమె కుమారుని జీవంతో లేపాడు. మద్దలమరియను ప్రేమతో ఆదరించాడు. వ్యభిచారంలో పట్టుపడిన స్త్రీని దయతో క్షమించాడు. తన అంగీ అంచును ముట్టుకొనిన స్త్రీ వ్యాధిని కరుణతో నయంజేసాడు. కననీయ స్త్రీ కొమార్తెనుండి దయ్యాన్ని పారదోలాడు. యాయిూరు కొమార్తెను జీవంతో లేపాడు. ఆలాంటి దయామయుడు ఈ స్త్రీలను మాత్రం ఓదార్చకుండా వుంటాడా?

ప్రభువు తన బాధలను తాను మరచిపోయి యెరూషలేము మహిళలకు సంభవింపనున్న విపతులను జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. క్రీస్తు మరణానంతరం యూదులు రోమను ప్రభుత్వంమీద తిరుగుబాటు చేసారు. రోమటైటస్ అనే సైన్యాధిపతిని పంపగా అతడు యెరూషలేమును ముట్టడించి దాన్ని సర్వనాశం చేసాడు. ఈ సంఘటనను మనసులో పెట్టుకొనే ప్రభువు ఆ స్త్రీలతో "మీరు నా కొరకు పరితపించకండి. మీ కొరకూ మీ బిడ్డ లకొరకూ పరితపించండి. కొద్ది యేండ్లలోనే ఈ నగరం నేలమట్టమౌతుంది. మీ బిడ్డలందరూ చనిపోతారు" అని చెప్పాడు.

ప్రార్ధనం

ప్రభూ! నీవు ఫరోరకష్టాలను అనుభవిస్తూగూడ నిన్ను ఓదార్చ వచ్చినవాళ్ళను ఓదార్చావు. నిన్ను నీవు మరచిపోయి ఎదుటివాళ్ళకు కలుగబోయే కీడునుగూర్చి పరితపించావు. మాకు దుఃఖాలు కలగినపుడు మా బాధలతోనే మేము సతమతమైపోక, ఎదుటివారి కష్టాలనుగూడ గమనించే భాగ్యం దయచేయి. తోడివారు మమ్మఓదార్చడానికి వచ్చినపుడు వారి సానుభూతికి కృతజ్ఞలమైయుండే భాగ్యాన్ని గూడ ప్రసాదించు.