పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబలంగా ఉండునుగాక. ఐనా ఆ మానుష ప్రేమను నేను మొరటుతనంతోను ఎడ్జెతనంతోను నిరాకరింపకుందునుగాక. నీ వలె మృదు హృదయంతోను ఉదాత్తాశయంతోను ఈ ప్రపంచంలోని ప్రేమమూరుల నుండి వైదొలగుదునుగాక. ఒక్క విషయం మాత్రం నాకు స్పష్టంగా తెలుసు. నావైపునకు ఏపుగా యెదిగే ప్రేమలతలను నేను నీ కోసమై ప్రక్కకు త్రోసివేసినపుడు, అవి యెండిపోవు. నీవు దయచేసే బలంతో ఇంకా యేపుగా ఎదుగుతాయి. నీ కొరకై ఏ మానుష ప్రేమను పరిత్యజిస్తామో ఆ ప్రేమ నీ దీవెన వలన నూరంతలు అధికంగా ఫలిస్తుంది.

ఐదవ స్థలం

కురేనియా సీమోనుని సిలువను మోయడానికి నిర్భంధించడం

క్రీస్తు ఒక్క నిమిషకాలం మాతృమూర్తి ప్రేమను అనుభవిస్తూ తన్ను తాను మరచిపోయాడు. ఆ నిమిషం ఐపోయింది. ఇక తాను ముందుకి సాగిపోవాలి. సిలువభారం అడుగడుక్కీ ముందటికంటే అధికమైనట్లుగా తోస్తూంది. మోయలేని బరువును ఒంటరిగా మోసూన్నాడు ప్రభువు. తన్ను ప్రేమించేవాళ్ళ అక్కడ కొందరున్నాముందుకి వచ్చి సాయపడే ధైర్యం వారికి లేదు. ధైర్యం వున్నవాళ్ళకూడ ఆ పరిస్థితుల్లో ముందుకు రాలేరు.

క్రీస్తు క్షణక్షణానికి క్రుంకిపోయే సూర్యుళ్ళా బలహీనుడు కావడం జూచి సైనికులు అటూఇటూ పారజూచారు. ఆ క్షణంలోనే పొలంనుండి మరలివచ్చే సీమోననే సేద్యగా డొకడు వారికంటబడ్డాడు. సైనికులు సిలువ మోయడంలో క్రీస్తుకి సాయపడమని అధికార పూర్వకంగా అతన్ని ఆజ్ఞాపించారు. సీమోనుకి మాత్రం ఈ కార్యం ఎంతమాత్రం ఇష్టంలేదు. తాను పొలం పనివలన ప్రేగులు తెంచుకొని ఆకలిగొని యింటికి వస్తున్నాడు. పైగా మోసగాడని పలువురు ఆడిపోసుకొనే ఈ క్రీస్తుకి తానెందుకు సాయపడాలి? సీమోనుని అనిష్టభావంజూచి సైనికులు అతన్ని నిర్బంధించారు. తప్పించుకొనే మార్గంలేక తప్పనిసరై అతడు సిలువమీద చేతులు వేసాడు. కాని మనసు లేనపుడు వట్టిచేతులు ఏపాటి సాయంచేస్తాయి? కనుక సీమోను అందించిన సాయం క్రీస్తుకి పెద్దగా ఉపకరించలేదు.

ప్రార్ధనం

పరోపకారుడవైన క్రీసూ! నీవు ఆపదలో ఉన్నవారికి ఎందరికో సాయం చేసావు. "కాని అవసరమొచ్చినపుడు నిన్నాదుకొనేవాడు ఒక్కడూ దొరకలేదు. నా కొరకు, నాకు మార్గంగాను బలంగాను ఉండడం కొరకు, నీవు చివరివరకు సమస్త బాధలు