పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/104

ఈ పుట ఆమోదించబడ్డది

బాధాకర సంఘటనలనుగూర్చి కొలదికాలం మననం చేసికొంటూండేవాళ్ళ ·ఈలాంటి “స్థలాలు" పూర్వకాలంలో ఎన్ని వుండేవో ఇప్పడు మనకు రూఢిగా తెలియదు.

    మరి కొన్నాళ్ళయిన పిదప యెరూషలేమునకు యాత్ర చేయలేని క్రైస్తవులకోసం తిరుసభ, నాడు సిలువ మార్గంలో యథార్థంగా సంభవించిన ఘట్టాలను పదునాల్డింటిని చిత్రాల రూపాన ఆయా దేవాలయాల్లో నెలకొల్పింది. నేడు మనం ఆచరించే సిలువ మార్గానికి ఇదే ప్రారంభం.
  ఈ స్లీవమార్గంద్వారా మనకు సిద్ధించే ప్రయోజనాలు ముఖ్యంగా రెండు. మొదటిది, క్రీస్తు బాధలను జ్ఞప్తికి తెచ్చుకొని, అతనితో ఐక్యమై, అతనికి సానుభూతిని దెల్పుతూ మన పాపాల కొరకు పశ్చాత్తాపపడతాం. ఈ భక్తికార్యంద్వారా మన హృదయం శుద్ధినీ పావిత్ర్యాన్నీ పొందుతుంది.
    రెండవది, బాధాతత్వంయొక్క రహస్యాన్ని తెలిసికొంటాం. ఇష్టంతోగాని కష్టంతోగాని మనమందరమూ ఈ జీవితంలో ఎన్నో బాధలు అనుభవించవలసిందే. క్రైస్తవ దృష్టి లేనివాళ్ళకు ఈ బాధలు వ్యర్థమనిపిస్తాయి. దాని వలన ఈ శ్రమలు మరింత బాధాకరమౌతాయి. కాని క్రైస్తవదృష్టిగల మన విషయం వేరు. బాధల ఆవశ్యకాన్నీ ప్రయోజనాన్నీ వాటిని అనుభవించవలసిన తీరునీ క్రీస్తే మనకు నేర్పించిపోయాడు. శ్రమలను గూర్చి క్రీస్తు నాడు నేర్పిపోయిన ఆ సత్యాలనే ఈ పుస్తకంలో ధ్యానాల రూపాన వివరించాం. కావుననే దీనికి “బాదాతత్వం” అని పేరు పెట్టాం.
    విశ్వాసులు ఈ పుస్తకంలోని అంశాలను చదువుకోవడంతో మాత్రమే తృప్తి చెందగూడదు. వాటిని ధ్యానించుకొని జీర్ణంజేసికోవాలి, జీవితంలో మనకుపయోగపడేది మనం తిన్న అన్నంగాదు, జీర్ణంచేసికొన్న అన్నం మాత్రమే. ఇంకా ఈ ధ్యానాలను సిలువమార్గాన్ని ఆచరిస్తూ మననం చేసికొంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది. వీటిని వ్యక్తిగత ప్రార్ధనకుగాని, సిలువమార్గాన్ని చేయడానికిగాని వాడుకోవచ్చు.
    ఇక, ఈ బాధాతత్వాలను జీర్ణంచేసికొన్న పిదప వీటిని మన జీవితంలోని ఆయా విషమఘట్టాలకు అన్వయించుకోవాలి. ఆలా అన్వయించుకొని మన బాధలను ఓర్పుతోను అర్థంవంతంగాను సహించుకోగల్గిననాడే గాని క్రీస్తు శ్రమలు మనపట్ల సత్ఫలితాన్ని ఈయవు.

ప్రారంభ ప్రార్ధనం

 నా రక్షకుడవైన ప్రభూ! నా శిష్యుడు కాగోరేవాడు తన స్లీవను తాను మోసికొంటూ ప్రతిదినం నన్ననుసరించాలని నీవే సెలవిచ్చావు. కావున నేనుకూడ నీవు తొక్కిన