పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/97

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలాంటి ప్రవచనాల ద్వారా నూత్న వేదప్రజకు రంగంసిద్ధమయింది. ఇక మెస్సీయా మరణికోత్థానాల ద్వారా ఈ ప్రజ ఉద్భవిస్తుంది.

2. నూత్నవేద ప్రజలు

1.క్రెస్తవ ప్రజల యెన్నిక

    మానవజాతిని రక్షించడానికి తండ్రి తన కుమారుడైన క్రీస్తుని పంపాడు. ఆ క్రీస్తు తన మరజోత్తారాలద్వారా నరజాతి పాపం తొలిగించి వారిని రక్షించాడు. ఆ ప్రభువు మన పాపాలకు మరణానికి గురయ్యాడు. మనలను పాపరహితులనుగా చేయడానికి ఉత్థానుడయ్యాడు - రోమా 4,25, ప్రభువు తన సిలువ మరణంద్వారా నూతనిబంధనను ఏర్పరచాడు. కనుకనే అతడు “ఇది అనేకుల పాపపరిహారం కొరకు చిందబడనున్న నూతన నిబంధనం యొక్క నా రక్తం" అని పల్కాడు - మత్త 26,28. పైన యిర్మీయా ప్రవక్త పేర్కొన్న నూతన నిబంధనం ఇదే - 81,31.
    మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడంద్వారా అతని ప్రజలమౌతాం. పూర్వవేదప్రజలు ఎన్నికా నిబంధనలద్వారా యావే ప్రజలయ్యారని చెప్పాం. నూతవేదంలో జ్ఞానస్నానం ఆ యెన్నికా నిబంధనలకు సమానం. ఈ జ్ఞానస్నానంద్వారా, పూర్వవేదంలో యిస్రాయేలీయులకు సంక్రమించిన బిరుదులన్నీ నూత్న వేదంలో మనకూ సంక్రమిస్తాయి, వాళ్ళలాగే మనంకూడ ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులం, పవిత్రజనం, దేవుని సాంతప్రజ ఔతాం - 1 పేత్రు 2,9.
 యూదులకు జాతి ముఖ్యమని చెప్పాం. నూత్న వేదప్రజలమైన మనకు జాతి ముఖ్యం కాదు. కేవలం క్రీనుని విశ్వసించడం ద్వారా మాత్రమే మనం నూత్నవేదప్రజలమౌతాం. కనుకనే తొలినాటి క్రైస్తవ సమాజంలో యూదులూ అన్యజాతివాళ్ళూ కూడ చేరారు. పౌలు "క్రీస్తుని విశ్వసించడం వలన మీరందరూ దేవుని పత్రులయ్యారు. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన మీరంతా అతన్ని ధరించారు. కావున మీలో యూదుడు అన్యుడు, బానిస స్వతంత్రుడు, పురుషుడు స్త్రీ అనే విభేదం లేదు. క్రీస్తులో మీరందరూ సరిసమానమే" అని వ్రాసాడు - గల 3, 26-28,
 తండ్రి పూర్వవేద ప్రజలను తిరస్కరించి నూతవేద ప్రజలను ఎన్నుకొన్నాడని చెప్పాం. ఆ ప్రజల బిరుదాలన్నీ మనకుగూడ సంక్రమిస్తాయని చెప్పాం. కనుకనే మనం దేవుని యిస్రాయేలీయులం - గల 6,16. అబ్రాహాము సంతానానిమి - గల 3, 29. నిజమైన సున్నతిని పొందిన వాళ్ళం - ఫిలి 3,3. నూత్న దేవాలయానిమి - 1కొ3, 16