పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5.దైవప్రజలు

                                               బైబులు భాష్యం - 61 

విషయ సూచిక

1.బైబులు బోధలు

2.దైవశాస్త్రరీత్యా గృహస్థలు

3.చారిత్రకంగా గృహస్థలు

4.మనదేశ పరిస్థితి

మనవిమూట

  వాటికన్ మహాసభ గృహస్థల నాయకత్వాన్ని ప్రోత్సహించింది. కనుక తిరుసభలో గృహస్థల స్థానమూ, ఆ సభకు వాళ్లు చేయవలసిన సేవలూ మొదలైన సమస్యలను గూర్చిన దైవశాస్తాంశాలు మన విశ్వాసులకూ గురువులకూ గూడక్షుణ్ణంగా తెలిసి వండాలి. గృహస్థలకు నాయకత్వపు తర్ఫీదునిచ్చేపడు ఈ యంశాలు అవసరమౌతాయి. ఈ రంగంలో తెలుగులో మన కుపయోగపడే పుస్తకాలు ఏమీ లేవు. అందుకే ఈ చిన్ని పొత్తాన్ని తయారు చేసాం,

1. బైబులు బోధలు

ఈ మొదటి అధ్యాయంలో దైవప్రజను గూర్చి బైబులు బోధించే అంశాలను పరిశీలిద్దాం. మొదట పూర్వ వేదాంశాలనూ తరువాత నూత్నవేదాంశాలనూ విలోకిద్దాం.

1. పూర్వవేద ప్రజలు

1. ఎన్నికా నిబంధనలద్వారా

 ఎన్నికా నిబంధనలద్వారా యూదులు దైవ ప్రజలయ్యారు. ఈ విషయాన్ని గూర్చి

ద్వితీయోపదేశకాండ ఈలా చెప్పంది. "మీరు ప్రభువుకి పవిత్ర ప్రజలు, అతడు ఈ భూమిమీది జనులందరిలోను మిమ్మే తన సొంత ప్రజలనుగా యెన్నుకొన్నాడు. మీరు ఇతరజాతులకంటి అధిక సంఖ్యాకులన్న తలంపుతో అతడు మిమ్మ ఎన్నుకోలేదు. మీరు 'జాతులన్నిటిలోను స్వల్పసంఖ్యాకులు. మరి యతడు స్వయంగా మిమ్మ ప్రేమించాడు కనుక, మీ పితరులతో తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకో గోరాడు కనుక, మిమ్మే