పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/88

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు దీవిస్తాడు. కాని అలా తోడ్పడనివాళ్లను శపిస్తాడు, విూరు నాకే తోడ్పడలేదని వాళ్లను నిందిస్తాడు. అప్పడు వాళ్లు "ప్రభూ నీవు మాయొద్దకు ఎప్పడువచ్చావు, నిన్ను మేమెప్పుడు ఆదరించలేదు" అని అడుగుతారు. ప్రభువు వాళ్లతో "నా శిష్యుల్లో అత్యల్పులు విూయొద్దకు వచ్చారు, విూరు వాళ్లను ఆదరించలేదు. వాళ్లను ఆదరించనపుడు నన్ను ఆదరించనట్లే" అంటాడు. ఇక్కడ క్రీస్తు శిష్యులంటే క్రైస్తవులు మాత్రమేగాదు, నరమాత్రులంతాను. మనం పేదసాదలను ఆదరించాలి అనడానికి ఇంతకన్న ప్రబలతార్మాణం ఏమి కావాలి?

మన దేశంలోని వివాది పదిశాతం ప్రజలు మహాధనవంతులు. వీళ్లకు ఉద్యోగాలూ, విద్యా ధనమూ అన్నీ వున్నాయి. సాగునేలలో 56 శాతం వీళ్ల అధీనంలో పంది. మనదేశపు జాతీయ ఆదాయంలో 3వ వంతు వీళ్లకే చెందుతుంది. ఇంజనియ్యురింగు వైద్యము మొదలైన వృత్తి కళాశాలల్లో చదివేవాళ్ళల్లో అధికభాగం వీళ్లపిల్లలే. ఐ సి యఫ్, ఐ ఎస్ ఎస్, ఐ పి యస్ ఉద్యోగుల్లో 80 శాతం వీళ్లే, కాని క్రింది 50 శాతం ప్రజలకు మాత్రం ఏ సదుపాయాలూ లేవు. కనుక వీళ్లు నిరుపేదల్లా జీవిస్తున్నారు. ఈ విధంగా దేశంలోని సదుపాయాలన్నీ విూది పదిశాతం ప్రజలు అనుభవించడమూ, క్రింది సగంశాతం ప్రజలు ఏ సదుపాయాలూ లేక మలమల మాడిపోవడమూ ఎంత దారుణం!


27. ఈ నా సోదరులలో అత్యల్పడైన వానికి ఒకనికి తోడ్పడినప్పడు నాకే తోడ్పడినట్లు - మత్త 25,40


విూదటి తుదితీర్పు సామెతనే ఇంకా పరిశీలిద్దాం. కొందరు ప్రభువు శిష్యులను ఆదరింపగా ప్రభువు వాళ్లు తన్నే ఆదరించినట్లుగా భావించాడు, వాళ్లను సంభావించి మోక్షాన్ని బహూకరించాడు. ఈ సామెత బోధించే భావాన్ని మనం చక్కగా గుర్తించాలి. బైబులు భగవంతుడు ఎక్కడో ఆకాశంలో వుండేవాడుకాదు. అతడు తన ప్రజలతో ఐక్యమై యుంటాడు, విశేషంగా పేదసాదల్లో జీవిస్తుంటాడు. కనుక మనం తోడి ప్రభలను ఆదరిస్తే భగవంతుణ్ణి ఆదరించినట్ల, తోడి ప్రజలను అనాదరం చేస్తే ఆ ప్రజల్లో నెలకొనివున్న భగవంతుణ్ణి అనాదరం చేసినట్లు, ఎప్పడూ భగవంతుడూ ప్రజ కలిసి వుంటారు. ప్రజను ఏచూపన చూస్తామో భగవంతుణ్ణి కూడ అదే చూపన చూచినవాళ్లమౌతాం. కనుక ప్రజలకు అన్యాయంచేసి దేవుణ్ణి పూజిస్తే లాభంలేదు.


నేటి పేదల పాట్లను తెలిసి కోవాలంటే రూపాయి కొనుగోలు విలువనుకూడ గమనించాలి, 1954లో మన రూపాయి కొనుగోలు విలువ 99 పైసలు, 1956లో 95 పైసలు. అప్పటి నుండి రూపాయి విలువ ఏటేటా దిగజారిపోతూ వచ్చింది. 1975లో