పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23 కోట్లమంది. పోషకాహారం లభించక పోవడంవల్ల ఈ పిల్లల్లో రెండున్నర కోట్లమంది గ్రుడ్డివాళ్ళయిపోతూంటారు. ఐదుకోట్లమంది మరణిస్తూంటారు. మిగిలిన పిల్లలు వ్యాధి బాధలకు లోనై చావకుండా బ్రతకకుండా జీవిస్తూంటారు. ఈనాటి బాలసంపదే రేపటి పౌరసంపద. బాల్యప్రాయంలో పోషకాహారం లభించని పిల్లలు ఇక జీవితమంతా అవిటి రకాలుగానే తయారౌతూంటారు. మరి ఈ పిల్లలందరినీ, విశేషంగా పేదసాదల బిడ్డలను పోషించేదెవరు?


25. విూరు ఒకరినొకరు ప్రేమిస్తే అప్పడు నా శిష్యులుగా గణింపబడతారు - యోహా 13,35


క్రీస్తు శిష్యులకు గుర్లేమిటి? ఉపన్యాసాలు ఈయడంగాదు, గ్రంథాలు వ్రాయడం గాదు. అద్భుతాలు చేయడంగాదు. అన్నదానాలూ, గృహదానాలూ, భూదానాలూ చేయడంగాదు, విద్యాసేవ వైద్యసేవ చేయడమూకాదు. ఇవన్నీ మంచివేకాని వీటినన్నిటిని స్వార్థబుద్ధితోగూడ చేయవచ్చు. అందుకే క్రీస్తు వీటిని వేటినీ తన శిష్యుల లక్షణాలుగా పేర్కోలేదు. అతడు పేర్కొన్న లక్షణం ఒక్కటే, ఒకరినొకరు ప్రేమించడం. నేను తోడి మానవుణ్ణి - విశేషంగా పేదవాణ్ణి - అంగీకరించి ఆదరించి ప్రేమిస్తే అప్పడు మాత్రమే క్రీస్తు శిష్యుణ్ణిగా గణింపబడతాను.


మన దేశంలోని పేదప్రజలు చాలమంది కర్మను సాకుగా జెపూంటారు. మాకర్మ వలన పేదవాళ్లంగా జీవిస్తున్నాం అంటూంటారు. ఇది పెద్ద పొరపాటు. నరుడు చేయవలసిన ప్రయత్నం చేయకుండా కర్మ సిద్ధాంతాన్ని నమ్మకొని కూర్చోవడం వట్టి మౌఢ్యం. నరుడు వృద్ధిలోకి రావాలంటే పురుషకారమూ వండాలి, దైవబలమూ వండాలి. పురుషకారంలేందే దైవం తోడ్పడదు. అనగా స్వయంకృషి లేని నరుడు వృద్ధిలోకి రాడు, కనుక మన పేదప్రజలు కర్మ సిద్ధాంతాన్ని విడనాడి కార్యసాధనకు పూనుకోవాలి. పూర్వజన్మనుండి వచ్చే కర్మఫలం అనేది ఒకటి లేనేలేదు. కష్టపడి పనిజేసికొనేవాడు ఈనాడు గాకపోతే రేపైనా రాణించి తీరతాడు.


26. ఈ యత్యల్పల్లో ఒకనికి తోడ్పడినప్పుడు నాకూ తోడ్పడినట్లే - మత్త 25,45


లోకాంతంలో ప్రభువు. మంచివాళ్లకూ చెడ్డవాళ్లకూ న్యాయనిర్ణయం చేస్తాడు. ఇతరులకు కూడూ గుడ్డాయిలల్లా వాకిలీ మందూ మాకూ యిచ్చి తోడ్పడిన వారిని