పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/69

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ బోధలద్వారా ప్రభువు సంపదల్లోవుండే ప్రలోభ గుణాన్ని చక్కగా వివరించి చూపాడు. అతని బోధలు పూర్వవేదంకంటె భిన్నమైనవని వేరుగా చెప్పనక్కరలేదు.

3. తొలినాటి శిష్యుల బోధలు

పేత్రు, పౌలు, యోహాను యాకోబు మొదలుగాగల తొలినాటి శిష్యులుకూడ సంపదలనుగూర్చి బోధించారు. వీళ్ళు చాలవరకు క్రీస్తుభావాలనే విప్పిచెప్పారు. ప్రస్తుతం వీళ్ళ భావాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. ఉన్నవాళ్ళ లేనివాళ్లతో పంచుకోవాలి

తొలినాటి క్రైస్తవులంతా యెరూషలేమలో ఓ సమాజంగా జీవించడం మొదలెట్టారు. వీళ్ళకు పేత్రు పెద్ద వీళ్లు పవిత్రాత్మ ప్రేరణంతోనే ఈ పుమ్మడి జీవితం జీవించారు. ఈ సమాజంలో ధనికులూ దరిద్రులూ కూడ వున్నారు. కాని క్రీస్తు నేర్చిన ప్రేమసూత్రాన్ని అర్థంచేసికొన్నవాళ్ళకనుక ఈ బృందంలోని ధనికులు తమ సిరిసంపదలను పేదలతో వంచుకొన్నారు - అచ 4, 32-35. బహుశః ఈ కార్యానికి మొదటపూనుకొన్నవాడు బర్నబా 4, 86-87. ఈ వుమ్మడి జీవితం, ఈయాస్తిపాస్తుల పంపకం తొలినాటి క్రైస్తవుల సోదరప్రేమకు చక్కని తార్మాణం. వాళ్లు ధనానికి గాక ధనమే వాళ్ళకు దాస్యం చేసింది అనడానికి ఇది మంచి నిదర్శనం. పాలు క్రైస్తవుల్లో కొందరు యూదులు, కొందరు గ్రీకులు. ఒకసారి పాలస్తీనా దేశంలో పెద్ద కరవు వచ్చింది. కనుక పౌలు గ్రీకుక్రైస్తవులచేత విరాళాలు సేకరింపజేసి ఆ సొమ్మను క్షామపీడితులైన యూదక్రైస్తవులకు పంపాడు. ఈ సందర్భంలో అతడు సమృద్ధిగా వున్నవాళ్లు అక్కరలో వున్నవాళ్ళను ఆదుకోవాలనీ, ఈలా చేస్తే సౌమ్మను సద్వినియోగం చేసినట్లవుతుందనీ బోధించాడు -2 కొ 8, 13-15. ఇంకా క్రీస్తునికూడ మనకు ఆదర్శంగా యెత్తి చూపించాడు. క్రీస్తు స్వయంగా భాగ్యవంతుడు. కాని అతడు బుద్ధిపూర్వకంగా నిరుపేదయై తన సొత్తుని మనతో పంచుకొన్నాడు. దానితో పేదలమైన మనం భాగ్యవంతులమయ్యాం. ఈ క్రీస్తు ఆదరాన్నే మనంకూడ ఈలోకంలో పాటించాలి - 2 కొ 8, 19.

క్రీస్తు వాక్యాలు కొన్ని సువిశేషాల్లోకి ఎక్కలేదు. పౌలు ఆలాంటి వాక్యాన్నొకదాన్ని గుర్తుంచుకొని ఉదాహరించాడు. "తీసికోవడంకంటె ఈయడం ధన్యమైంది" - అచ 20, 35. పౌలు ఒకరిసొమ్ముకు ఆశపడలేదు. అతడు కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకొన్నాడు, ఇతరుల నుండి తానేమీ తీసికోకపోయినా ఇతరులకు తాను చాలా యిచ్చాడు. తన శిష్యులుకూడ ఆలాగే చేయాలని హెచ్చరించాడు - 20, 33-35.