పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనాన్ని కూడబెట్టుకొని దానిశక్తితో అహాన్ని పెంచుకొంటారు. తోడినరులను పీడిస్తారు. దేవుణ్ణి చులకన చేస్తారు. క్రీస్తు ఖండించింది ధనశక్తిని ఈలా దుర్వినియోగం చేయడాన్ని గాని, అసలు డబ్బునేకాదు.

ధనశక్తిని సద్వినియోగం జేసికొని ఆదర్శప్రాయులుగా జీవించినవాళ్ళనుగూడ బైబులు పేర్కొంటుంది. యెరూషలేములోని పేదరాలు తనకున్న రెండుకాసులను దేవునికే అర్పించి మాన్యురాలయింది - మార్కు 12, 41-44. తొలినాటి యెరూషలేము సమాజంలోని ధనవంతులు తమసౌత్తును పేదలతో పంచుకొని ఆ పేదల యిక్కట్టలను తొలగించారు - అచ 2, 45. 4, 32. డబ్బు అనేది నరుల అక్కరలను తీర్చడంకోసం ఉద్దేశింపబడింది. వస్తువులు వాడుకోవడం కోసమే వున్నాయి. కనుక ఈ యెరూషలేము సమాజంలోని ధనవంతులు తమకు అధికంగా ఉన్నవాటిని లేనివాళ్ళ వినియోగంకొరకు ఇచ్చివేసారు. తమ వస్తువులను ఇతరులతో పంచుకొని సోదరప్రేమను నిరూపించుకొన్నారు. అలాగే తొలిరోజుల్లో కరువువచ్చినపుడు గ్రీకుక్రైస్తవులు సౌమ్మ ప్రోగుజేసి యూద క్రైస్తవులకు పంపారు. 2 కొ 8, 14 మామూలుగా ధనవంతుడు తన ధనశక్తితో ఇతరులను పీడిస్తాడు. ఇక్కడ ఈ గ్రీకుక్రైస్తవులు తమ సొత్తుతో తోడినరులను పీడించలేదుగదా, వాళ్ళకి సాయంచేసారు. ఈ వుదాహరణాలన్నిటిల్లోను నరులు ధన శక్తిని సద్వినియోగం జేసికొన్నారు కాని దుర్వినియోగం చేసికోలేదు. కనుక డబ్బు దానంతట అది చెడ్డది కాదు, మంచిదే. దాన్ని మంచికి వాడామా లేక చెడ్డకు వాడామా అన్నదాన్ని బట్టి దాని మంచి చెబ్బరలను నిర్ణయించాలి.

6. విజ్ఞాన బోధ

మనం ఈ లోకంలోగాక పరలోకంలో సంపదలుకూడబెట్టుకోవాలని బోధించాడు క్రీస్తు. ఈ బోధ విజ్ఞానగ్రంథాల బోధల ధోరణిలో వుంటుంది. “ఈ లోకంలో సంపదలను కూడబెట్టుకొంటే వాటిని చిమ్మట పరుగులూ త్రుప్పతినివేస్తాయి. దొంగలు దోచుకొంటారు గూడ, భూలోక సంపదలు క్షణికమైనవి. కనుక మనం పరలోక సంపదలను కూడబెట్టు కోవాలి. అక్కడ అవి అక్షయంగా వుండిపోతాయి. మన సంపదలున్నకాడనే మన వృదయం కూడ వుంటుంది. అనగా మనకు ఈ లోక సంపదలమీద కోరికలుంటే మన హృదయం ఈలోక వస్తవుల మీదనే లగ్నమౌతుంది. ఆలా కాకుండా పరలోక సంపదలమీద కోరికలు పెట్టుకొంటే మన హృదయం కూడ దేవునిమీదా, మోక్షంమీదా లగ్నమౌతుంది - మత్త 6, 19–25. శిష్యుడు మొదట దైవరాజ్యాన్ని వెదకాలి. అప్పడు ఈ లోకవస్తువులన్నీ వాటంతట అవే సిద్ధిస్తాయి - 6, 33.